హాలీవుడ్‌ హీరోతో బాలీవుడ్‌ నటి డేటింగ్! | Priyanka Chopra and Tom Hiddleston dating | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ హీరోతో బాలీవుడ్‌ నటి డేటింగ్!

Published Sun, Oct 2 2016 1:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

హాలీవుడ్‌ హీరోతో బాలీవుడ్‌ నటి డేటింగ్!

హాలీవుడ్‌ హీరోతో బాలీవుడ్‌ నటి డేటింగ్!

దేశీగర్ల్‌ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌ నటుడు టామ్‌ హిడిల్‌స్టోన్‌ మధ్య ఏదో జరుగుతున్నదని హాలీవుడ్‌ చెవులు కొరుక్కుంటున్నది. హాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీబిజీగా ఉన్న ప్రియాంక తాజాగా ‘థోర్‌’ నటుడు టామ్‌తో డేటింగ్‌ చేస్తున్నదట. ఈ ఇద్దరు కలిసి లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఎమ్మీ సంగీత వేడుకలో ఓ అవార్డు ప్రదానం చేశారు. ఈ వేడుక తర్వాత జరిగిన పార్టీలో ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు మనస్సు పడ్డారట. ‘టామ్‌ ప్రియాంక చుట్టు చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆమె అతని టైని సరిచేసింది. అనంతరం ఇద్దరు ఒకరి బుగ్గలపై ఒకరు ముద్దు పెట్టుకున్నారు’ అని ఓ హాలీవుడ్‌ పత్రిక విశ్వసనీయ వర్గాలను ఉటంకించింది.

టామ్‌తో ప్రియాంక డేటింగ్‌ చేస్తున్నదనే విషయాన్ని ‘గ్లీ’ నటి లీ మిషెలీ కూడా ధ్రువీకరించింది. ఎలెన్‌ డీజెనరస్‌ షోలో పాల్గొన్న మిషెల్లీను టామ్‌తో డేటింగ్‌ చేస్తావా? అని అడుగగా.. ‘అతను చాలా చేస్తున్నాడు. అతనితో చేయను. ఇప్పుడు అతను ప్రియాంక చోప్రాను ప్రేమిస్తున్నాడు. వారు ప్రేమలో ఉన్నారు’ అని పేర్కొంది. అయితే, ఇటు టామ్‌ హిడిల్‌స్టోన్‌ గానీ, అటు ప్రియాంకగానీ ఈ వార్తలపై పెదవి విప్పడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement