Tom hiddleston
-
హాలీవుడ్ తెరపై ఓ సాహస యాత్ర
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ని అధిరోహించడం చాలా కష్టం అనే అభిప్రాయాన్ని అబద్ధం చేశారు ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే. న్యూజిల్యాండ్‌కి చెందిన ఎడ్మండ్, నేపాల్‌కి చెందిన టెన్జింగ్ 1953లో ఎవరెస్ట్ చేరుకుని, అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఇద్దరూ సాధించిన చరిత్ర నేపథ్యంలో హాలీవుడ్లో ‘టెన్జింగ్’ టైటిల్‌తో బయోపిక్ రూపొందనుంది. ఈ చిత్రంలో ఎడ్మండ్ హిల్లరీ పాత్రకు టామ్ హిడిల్స్టన్ని ఎంపిక చేశారు. యాత్ర నాయకుడు కల్నల్ జాన్ హంట్ పాత్రను విల్లెం డాఫో పోషించనున్నారు. టెన్జింగ్ నార్గే పాత్రకు సంబంధించిన ఎంపిక జరుగుతోంది. షెర్పా (పర్వతారోహకులు) కమ్యూనిటీతో సన్నిహిత సంబంధాలు ఉన్న జెన్నిఫర్ పీడోమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 2015లో ‘షెర్పా’ పేరిట జెన్నిఫర్ పీడోమ్ ఓ డాక్యుమెంటరీ తెరకెక్కించారు కూడా. అప్పుడు కొందరు పర్వతారోహకుల అనుభవాలను సేకరించి, ‘షెర్పా’ని చిత్రీకరించారు. తాజాగా జెన్నిఫర్ తెరకెక్కించనున్న ‘టెన్జింగ్’కి ల్యూక్ డేవిస్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. లిజ్ వాట్స్, ఎమిలే షెర్మాన్, ఇయాన్ కానింగ్ తదితరులు నిర్మించనున్నారు. ‘‘ఒక సాహస యాత్రను తెరపై ఆవిష్కరించడానికి ఆసక్తిగా ఉన్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్‌ని వచ్చే ఏడాది ఆరంభించాలనుకుంటున్నారు. -
నెక్ట్స్ బాండ్ ఎవరు?
చురుకైన చూపులు, బులెట్లకు ఎదురెల్లే నైజం, దిగాలన్నా, దూకాలన్నా మరో ఆలోచన చేయని ధైర్యం, శత్రువుల ఎత్తుల మీద ఎక్కిÐð ళ్లే సాహసం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అన్నీ జేమ్స్ బాండ్‌కి నిర్వచనాలే. ‘మై నేమ్ ఈజ్ బాండ్. జేమ్స్ బాండ్. 007’ అంటూ 58 ఏళ్లుగా స్క్రీన్ మీద సీక్రెట్ ఏజెంట్‌గా ఎన్నో ఆపరేషన్స్ విజయవంతం చేస్తున్నాడు బాండ్. ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన ఈ సీక్రెట్ ఏజెంట్ ఆన్ స్క్రీన్ సూపర్ సక్సెస్ఫుల్. 58 ఏళ్లలో 25 బాండ్ చిత్రాలు తెరకెక్కాయి. ఆరుగురు హీరోలు జేమ్స్ బాండ్‌గా ఈ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. తాజాగా మరోసారి బాండ్ ముఖం మారనుంది. జేమ్స్ బాండ్‌గా కొత్త హీరో తెరమీదకు రానున్నాడు. ఇప్పటివరకు కనిపించిన బాండ్లు 1962లో విడుదలయిన ‘డాక్టర్ నో’తో తొలి బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్ బాండ్ సినిమాల్లో బాండ్‌గా చేశారాయన. ‘ఫ్రమ్ రష్య విత్ లవ్, గోల్డ్‌ఫింగర్, తండర్‌బాల్, యూ ఓన్లీ లివ్ ట్వైస్, డైమండ్స్ ఆర్ ఫరెవర్’ సినిమాల్లో బాండ్‌గా కనిపించారు షాన్ కానరీ. ఆ తర్వాత ‘ఆన్ హర్ మెజెస్టిక్ సీక్రెట్ సర్వీస్’ సినిమాలో జార్జ్ లెజెన్బీ బాండ్ అయ్యారు. ఆ తర్వాత రోజర్ మూరే రికార్డు స్థాయిలో ఏడు సినిమాల్లో బాండ్ అవతారమెత్తారు. ‘లివ్ అండ్ లెట్ డై, ది మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్, ది స్పై హూ లవ్డ్ మీ, మూన్రాకర్, ఫర్ యువర్ ఐస్ ఓన్లీ, ఆక్టోపస్సీ, ఏ వ్యూ టు ఏ కిల్’ సినిమాల్లో రోజర్ మూరే నటించారు. ఓ రెండు సినిమాల్లో (ది లివింగ్ డే లైట్స్, లైసెన్స్ టు కిల్) తిమోతీ డాల్టన్, నాలుగు సినిమాల్లో (గోల్డెన్ ఐ, టుమారో నెవర్ డైస్, ది వరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్, డై అనదర్ డే) పీర్స్ బ్రోస్నన్ బాండ్‌గా కనిపించారు. ప్రస్తుతం బాండ్‌గా ఉన్న డేనియల్ క్రెగ్ తాజాగా విడుదలవనున్న ‘నో టైమ్ టు డై’తో కలిపి ఐదు సినిమాల్లో జేమ్స్ బాండ్ పాత్రలో కనిపించారు. ‘కాసినో రాయల్, క్వాంటమ్ ఆఫ్ సోలస్, స్కై ఫాల్, స్పెక్ట్రే’ గతంలో ఆయన బాండ్‌గా చేసిన సినిమాలు. ‘నో టైమ్ టు డై’ విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్‌లో ప్రకటన? బాండ్ 25వ సినిమా ‘నో టైమ్ టు డై’ విడుదల సందర్భంగా నెక్ట్స్ బాండ్ ప్రకటన ఉంటుందని టాక్. జూన్‌లో టామ్ హార్డీ బాండ్ పాత్ర కోసం ఆడిషన్ చేశారని టాక్. తదుపరి బాండ్ ఆయనే అని హాలీవుడ్ పత్రికలు రాసేస్తున్నాయి. ‘మ్యాడ్ మాక్స్ ఫరీ రోడ్, ది డార్క్ నైట్ రైసస్, వెనమ్, ది రెవనంట్’ వంటి సినిమాల్లో పాపులారిటీ పొందారు హార్డీ. మరి రాబోయే కొత్త బాండ్ ఈ జేమ్స్ బాండ్ ఇమేజ్ను ఎలా ముందుకు తీసుకెళతాడన్నది కాలమే చెబుతుంది. బాండ్ రేసులో ఎవరున్నారు? ‘ఇక నేను బాండ్ సినిమాల్లో నటించను’ అని డేనియల్ క్రెగ్ ప్రకటించేశారు. మరి.. తదుపరి బాండ్ చిత్రాల్లో జేమ్స్ బాండ్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది. హాలీవుడ్ నటులు టామ్ హార్డీ, టామ్ హిడిల్స్టన్, ఇద్రిస్ ఎల్బా వంటి నటులు నెక్ట్స్ బాండ్‌గా కనిపించేందుకు రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి చాన్స్ ఉందని హాలీవుడ్ టాక్. ఈ ముగ్గురూ కాకుండా హెన్రీ కావిల్ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. నెక్ట్స్ బాండ్ ఎవరు? -
హాలీవుడ్ హీరోతో బాలీవుడ్ నటి డేటింగ్!
దేశీగర్ల్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ నటుడు టామ్ హిడిల్‌స్టోన్ మధ్య ఏదో జరుగుతున్నదని హాలీవుడ్ చెవులు కొరుక్కుంటున్నది. హాలీవుడ్లో వరుస ఆఫర్లతో బిజీబిజీగా ఉన్న ప్రియాంక తాజాగా ‘థోర్’ నటుడు టామ్‌తో డేటింగ్ చేస్తున్నదట. ఈ ఇద్దరు కలిసి లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఎమ్మీ సంగీత వేడుకలో ఓ అవార్డు ప్రదానం చేశారు. ఈ వేడుక తర్వాత జరిగిన పార్టీలో ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు మనస్సు పడ్డారట. ‘టామ్ ప్రియాంక చుట్టు చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆమె అతని టైని సరిచేసింది. అనంతరం ఇద్దరు ఒకరి బుగ్గలపై ఒకరు ముద్దు పెట్టుకున్నారు’ అని ఓ హాలీవుడ్ పత్రిక విశ్వసనీయ వర్గాలను ఉటంకించింది. టామ్‌తో ప్రియాంక డేటింగ్ చేస్తున్నదనే విషయాన్ని ‘గ్లీ’ నటి లీ మిషెలీ కూడా ధ్రువీకరించింది. ఎలెన్ డీజెనరస్ షోలో పాల్గొన్న మిషెల్లీను టామ్‌తో డేటింగ్ చేస్తావా? అని అడుగగా.. ‘అతను చాలా చేస్తున్నాడు. అతనితో చేయను. ఇప్పుడు అతను ప్రియాంక చోప్రాను ప్రేమిస్తున్నాడు. వారు ప్రేమలో ఉన్నారు’ అని పేర్కొంది. అయితే, ఇటు టామ్ హిడిల్‌స్టోన్ గానీ, అటు ప్రియాంకగానీ ఈ వార్తలపై పెదవి విప్పడం లేదు. -
'మా వాడు తన గర్ల్ ఫ్రెండ్‌తో ఫుల్ హ్యాపీ'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ బ్రిటన్ నటుడు టామ్ హిడెల్ స్టోన్ తన ప్రేయసితో సంతోషంగా ఉన్నాడట. ఈ విషయాన్ని అతడి స్నేహితుడు, మరో నటుడు, నిర్మాత హెమ్స్ వర్త్ మీడియాకు చెప్పాడు. తన మిత్రుడు టామ్ తన గర్ల్ ప్రెండ్ టేలర్ స్విప్ట్తో చాలా సంతోషంగా ఉన్నాడని చెప్పాడు. ప్రస్తుతం 'థార్:రాగ్నారాక్' అనే చిత్రంతో హెమ్స్ బిజీగా ఉన్నాడు. ఇతడికి టామ్ బెస్ట్ ప్రెండ్. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన వివరాలను మీడియా అడిగింది. 'మీ స్నేహితుడు టామ్ ఎలా ఉన్నాడు? అతడి కొత్త గర్ల్ ఫ్రెండ్ టేలర్ ఎలా ఉంది' అని ప్రశ్నించారు. 'దీంతో ఆమె చాలా గొప్పది. వారిద్దరు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆమె టామ్ కు బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. అయితే, నేను వ్యక్తిగతంగా ఆమెను కలవలేదు. కానీ, కొద్ది రోజులకిందటే నా స్నేహితుడికి పరిచయం అయింది. ఆమె చాలా మంచిదని చెప్పగలను' అని వివరించాడు. -
ఈ ఇద్దరూ కాదట!
కొత్త జేమ్స్ బాండ్ చిత్రానికి సరికొత్త టీమ్ రెడీ అవుతోంది. ‘క్యాసినో రాయల్’ నుంచి ఇటీవల వచ్చిన ‘స్పెక్టర్’ సినిమా వరకూ బాండ్‌గా నటించిన డేనియల్ క్రెగ్ ఇక తాను ఆ పాత్ర చేయలేనని చెప్పడంతో మరో హాలీవుడ్ నటుడు టామ్ హిడెల్స్టెన్ని బాండ్‌గా ఎంపిక చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే కొత్త బాండ్‌గా టామ్ నటించే అవకాశం లేదని ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’ వంటి బాండ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శామ్ మెండెస్ చెప్పారు. అంతే కాకుండా ఇక తదుపరి బాండ్ చిత్రాలకు తాను కూడా దర్శకుణ్ణి కాదని ఆయన ప్రకటించడం విశేషం. ‘‘నాకు ఎప్పటికప్పుడు కొత్త పాత్రలతో, సరికొత్త కథాంశాలతో సినిమాలు చేయా లని ఉంటుంది. ఆ కారణంగానే నెక్ట్స్ బాండ్ చిత్రానికి నో చెప్పేశాను. టామ్‌ని కూడా బాండ్‌గా తీసుకునే ఉద్దేశం నిర్మాతలకు లేదు. బాండ్‌గా ఎవరూ ఊహించని నటుణ్ణి ఎంపిక చేసే అవకాశం ఉంది’’ అని శామ్ పేర్కొన్నారు. మరి... కొత్త బాండ్ చిత్రానికి డెరైక్టర్ ఎవరు? బాండ్‌గా ఎవరు నటిస్తారు? అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ఏదేమైనా కొత్త టీమ్‌తో నెక్ట్స్ జేమ్స్‌బాండ్ మూవీ ఇప్పటివరకూ వచ్చిన బాండ్ చిత్రాలకు భిన్నంగా, కొత్తగా ఉంటుందని ఆశించవచ్చు. -
కొత్త బాండ్‌గా టామ్ హిడెల్‌స్టన్
జేమ్స్ బాండ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసిందే. ‘బాండ్.. జేమ్స్ బాండ్’ అంటూ తాము ధైర్యవంతులమని చెప్పుకోవడానికి పిల్లలు బాండ్ పేరుని వాడుకుంటారు. పెద్దలకు కూడా బాండ్ క్యారెక్టర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఇప్పటివరకూ బాండ్ సిరీస్‌లో వచ్చిన ఇరవై నాలుగు సినిమాలూ దాదాపు అందర్నీ ఆకట్టుకున్నాయి. 24వ చిత్రం ‘స్పెక్టర్’, అంతకుముందు వచ్చిన మూడు బాండ్ చిత్రాలు ‘కేసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సోలాస్’, ‘స్కైఫాల్’లో టైటిల్ క్యారెక్టర్ని నటుడు డేనియల్ క్రెగ్ అద్భుతంగా పోషించారు. కానీ, 25వ చిత్రంలో ఆయన నటించరు. ‘ఇక బాండ్ చిత్రాల్లో నటించడం నా వల్ల కాదు. ఆ సినిమాల్లో నటించే కన్నా టోటల్‌గా సినిమాలు మానేయడం బెటర్’ అని స్వయంగా ఆయనే పేర్కొన్న దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్శక-నిర్మాతలు కొన్ని నెలలుగా కొత్త బాండ్‌ని వెతికే పని మీద ఉన్నారు. బాండ్ సిరీస్‌లో వచ్చిన గత రెండు చిత్రాలు ‘స్కైఫాల్’, ‘స్పెక్టర్’లు శామ్ మెండెస్ దర్శకత్వంలోనే రూపొందాయి. 17వ చిత్రం నుంచి 24వ బాండ్ చిత్రం వరకూ బార్బరా బ్రోకోలియే నిర్మించారు. 25వ చిత్రానికి టామ్ హిడెల్‌స్టన్ సరిపోతారని ఆమె భావించారట. దర్శకుడికి కూడా అదే అనిపించి, చివరకు టామ్ హిడెల్స్టన్ని ఎంపిక చేశారని సమాచారం. 35 ఏళ్ల టామ్ ‘థోర్’, ‘ది ఎవెంజర్స్’, ‘మిడ్నైట్ ఇన్ ప్యారిస్’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు జేమ్స్ బాండ్‌గా ఎంతమంది హృదయాలు దోచేస్తారో వేచి చూడాలి. బాండ్‌గా సక్సెస్ అయితే, టామ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్ప వచ్చు.