ప్రియాంక.. మోస్ట్ డేంజరస్ గురూ! | Priyanka chopra 'most sensational celebrity' in Indian cyberspace, says Intel | Sakshi
Sakshi News home page

ప్రియాంక.. మోస్ట్ డేంజరస్ గురూ!

Published Wed, Oct 7 2015 7:54 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

ప్రియాంక.. మోస్ట్ డేంజరస్ గురూ!

ప్రియాంక.. మోస్ట్ డేంజరస్ గురూ!

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా చాలా డేంజరస్ అట. అదేంటి.. చక్కగా నటిస్తోంది కదా అనుకుంటున్నారా.. మామూలుగా కాదండీ, ఇంటర్నెట్లో మాత్రమే ఈమె ప్రమాదకారిగా ఉందట. ఇంతకుముందు ఆలియాభట్ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉండగా, ఆమెను తోసిరాజని ప్రియాంక ఇప్పుడు ప్రమాదకారిగా మారిపోయింది. ఈ విషయాన్ని ఇంటెల్ సంస్థ స్వయంగా ప్రకటించింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రియాంకా చోప్రా అనే పేరుతో సెర్చ్ చేస్తే.. అత్యంత ప్రమాదకరమైన వెబ్ సైట్ల లింకులు వస్తున్నాయి. పొరపాటున వాటిని ఓపెన్ చేశారో, ఇక మీ కంప్యూటర్ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మీ ఈమెయిల్ ఐడీ పాస్వర్డుల దగ్గర్నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డుల వరకు అన్నీ వాళ్లకు అర నిమిషంలో తెలిసిపోయే అవకాశం ఉంటుంది.

ఈ జాబితాలో ఇంకా చాలామంది ప్రముఖులే ఉన్నారు. శ్రద్ధా కపూర్, కపిల్ శర్మ.. ఇలాంటి వాళ్ల పేర్లతో కూడా ఇంటర్నెట్ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. టీవీ షో ప్రీమియర్లు, అవార్డు షోలు, సినిమా ఆడియో విడుదల, సెలబ్రిటీల బ్రేకప్లు.. ఇలాంటి విషయాల ఆధారంగా సైబర్ నేరగాళ్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. టోరెంట్, హెచ్డీ డౌన్లోడ్, ఫ్రీ ఎంపీ4 లాంటి పదాలను ఈ సెలబ్రిటీల పేర్లకు జతచేసి.. నిజంగా అందులో ఏవైనా డౌన్లోడ్లు ఉన్నాయేమోనని భ్రమపడేలా చేసి ఆకర్షించడం, ఆపై వాటిలో ప్రమాదకరమైన లింకులు పెట్టడం వీళ్లకు అలవాటుగా మారింది. ఇంతకుముందు కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కంగనా రనౌత్, హృతిక్ రోషన్, దీపికా పడుకొన్, ఇమ్రాన్ హష్మి, సన్నీ లియోన్, ఆలియాభట్, ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ లాంటి సెలబ్రిటీల పేర్లతో ప్రమాదకరమైన లింకులు పెట్టిన ఘటనలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement