ఏకీకృత సర్వీసు నిబంధనలు వద్దు
► ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఉపాధ్యాయుల ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ విరుద్ధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబం ధనలను అమలు చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలను ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యా యులు కోరారు. ఏకీకృత సర్వీసు నిబం ధనలను అమలు చేయవద్దని డిమాండ్ చేస్తూ రెండు రాష్ట్రాల ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యాన సోమ వారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేప ట్టారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ, పంచా యతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయడం సరికాదని ఉన్నత న్యాయస్థానాలు తీర్పు చెప్పాయని తెలిపారు.
సర్వీ స్ రూల్స్ అమలుకు పంపిన ఫైలును గతంలో ఇద్దరు రాష్ట్రపతులు వెనక్కి పంపారని గుర్తు చేశారు. అయితే, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా ఏకీకృత సర్వీసు నిబంధనలను అమలు చేయాలనుకోవడం సరికాదన్నారు. ఇద్దరు రాష్ట్రప తులు గతంలో వెనక్కి పంపిన ఫైలును మళ్లీ రాష్ట్రపతి ఆమోదానికి పంపేందుకు సిద్ధమవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.
కోర్టు తీర్పు లను అమలు చేయకపోవడం వల్ల 20 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు హక్కుగా లభించాల్సిన పదోన్నతులు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి)ని పరిరక్షించి, తమ ప్రయోజనాలను కాపాడాలని కోరు తూ రాష్ట్రపతి భవన్‌లో వినతిపత్రం సమర్పిం చి నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ధర్నాలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల అధ్య క్షులు బి.తిరుపాల్, సన సురేంద్ర, ప్రధాన కార్య దర్శులు తులసీదాస్, వీరాచారి పాల్గొన్నారు.