ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలోకి మళ్లీ రాజాభయ్యా
వివాదాస్పద ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా.. మళ్లీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి అయ్యారు. దాదాపు ఏడునెలల విరామం తర్వాత ఆయన మళ్లీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రతాప్గఢ్లో డీఎస్పీ జియా ఉల్ హక్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో అప్పట్లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు సీబీఐ ఆయనపై కేసును మాఫీ చేయడంతో సీఎం అఖిలేష్ యాదవ్ వెంటనే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
రాజ్భవన్లో సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, సీఎం అఖిలేష్ యాదవ్, సీనియర్ మంత్రి ఆజంఖాన్ల సమక్షంలో గవర్నర్ బీఎల్ జోషి రాజాభయ్యాతో ప్రమాణస్వీకారం చేయించారు. అయితే రాజాభయ్యాకు ఇంకా శాఖ మాత్రం కేటాయించలేదు. ఇంతకుముందు ఆయన ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అసలు సీబీఐ దర్యాప్తు కూడా పూర్తి కాకముందే మీడియా మాత్రం తనను దోషిగా నిర్ధారించేసింంటూ రాజా భయ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.