అక్కడ మొత్తం రిజర్వేషన్లు 68 శాతం! | Rajasthan reservation quota reaches 68 percent | Sakshi
Sakshi News home page

అక్కడ మొత్తం రిజర్వేషన్లు 68 శాతం!

Published Wed, Sep 23 2015 8:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

అక్కడ మొత్తం రిజర్వేషన్లు 68 శాతం!

అక్కడ మొత్తం రిజర్వేషన్లు 68 శాతం!

రాజస్థాన్ అసెంబ్లీ తీసుకున్న సరికొత్త నిర్ణయం కారణంగా.. అక్కడి రిజర్వేషన్ల కోటా 50 శాతాన్ని దాటిపోయింది. అసెంబ్లీ రెండు బిల్లులను ఆమోదించింది. దాంతో గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (ఎస్బీసీ) కోటా కింద 5 శాతం, ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈబీసీ) 14 శాతం రిజర్వేషన్లను ఇవ్వడానికి ఆమోదించారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల కోటా 68 శాతానికి చేరుకుంది. వాస్తవానికి చట్టప్రకారం గరిష్ఠంగా మొత్తం రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటకూడదు.

అయితే, తాము కొత్తగా ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చడం ద్వారా వాటికి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చూడాలని రాజస్థాన్లోని వసుంధర రాజె ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే.. అసలు రిజర్వేషన్ల వ్యవస్థనే మొత్తం సమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక్కరోజు తర్వాతే రాజస్థాన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement