రజనీ కొత్త పార్టీని పెట్టబోతున్నారు! | Rajinikanth will only float his own party | Sakshi
Sakshi News home page

రజనీ కొత్త పార్టీని పెట్టబోతున్నారు!

Published Sun, May 21 2017 3:39 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రజనీ కొత్త పార్టీని పెట్టబోతున్నారు! - Sakshi

రజనీ కొత్త పార్టీని పెట్టబోతున్నారు!

చెన్నై: ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమంటూ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సంకేతాలు ఇవ్వడంతో ఇప్పుడీ అంశంపై  తమిళనాడు రాజకీయాల్లో హాట్‌హాట్‌ చర్చ జరుగుతోంది. రజనీకాంత్‌ త్వరలోనే బీజేపీలో చేరవచ్చునని కథనాలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు సు థిరునావుక్కరసార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌ సొంతంగా పార్టీని స్థాపించబోతున్నారని, ఆయన ఏ జాతీయ పార్టీలోగానీ, ప్రాంతీయపార్టీలోగానీ చేరబోరని ఆయన అన్నారు.

‘ఒక స్నేహితుడిగా రజనీ నాకు గత 35 నుంచి 40 ఏళ్లుగా తెలుసు. ఆయన ఏ జాతీయ పార్టీలోగానీ, ప్రాంతీయ పార్టీలోగానీ చేరతారని నేను అనుకోవడం లేదు. ఆయనే సొంతంగా పార్టీ ఏర్పాటుచేయవచ్చు’ అని ఆయన విలేకరులకు తెలిపారు. రజనీ పార్టీ పెడితే.. ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది ఆయన ఇష్టమని, దానిపై తానేమీ చెప్పలేనని అన్నారు. రాజకీయాలపై రజనీ తాజాగా పరోక్ష వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి రావొచ్చంటూ బలంగా చర్చ జరుగుతుండగా.. ఆయనను తనవైపు తిప్పుకోవాలని బీజేపీ శాయశక్తులా కృషి చేస్తున్నట్టు వినిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement