నాగార్జునకు మినహాయింపు ఎందుకంటే! | Ram Gopal Varma wishes nagarjuna on his birth day | Sakshi
Sakshi News home page

నాగార్జునకు మినహాయింపు ఎందుకంటే!

Published Mon, Aug 29 2016 8:40 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగార్జునకు మినహాయింపు ఎందుకంటే! - Sakshi

నాగార్జునకు మినహాయింపు ఎందుకంటే!

రాంగోపాల్‌ వర్మ క్రియేటివ్‌ దర్శకుడే కాదు.. కొంత విచిత్రమైన వ్యక్తి. ఆ మాట ఆయనే ఒప్పుకొంటారు. తను అందరిలాంటి మనిషిని కాదని, తన స్టైల్‌ డిఫరెంట్‌ అని చెప్తారు. నిజమే. ఒప్పుకోవచ్చు. అలాంటి వర్మ నాగార్జున విషయంలో ఓ మినహాయింపు ఇచ్చారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో మినహాయింపు ఏమిటంటే వర్మ సాధారణంగా ఎవరి పుట్టినరోజులకు శుభాకాంక్షలు గట్రా చెప్పరు. కానీ, 'శివ' సినిమాతో తనకు దర్శకుడిగా జన్మను ఇచ్చింది నాగార్జునే. కాబట్టి ఆయన విషయంలో ఈ నిబంధనకు మినహాయింపు ఇచ్చి.. నాగ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అంతేకాకుండా ప్రతి పుట్టినరోజుకు నాగార్జున యంగ్‌ గా తయారవుతున్నారంటూ కితాబు కూడా ఇచ్చారు వర్మ. తనయులైన నాగా చైతన్య, అఖిల్‌ రోజురోజుకు వయస్సు పెరిగి నాగార్జునను చేరువ అవుతుంటే.. నాగార్జునేమో వయస్సు తగ్గి వారితో సమానంగా కనిపించేందుకు పోటీపడుతున్నట్టు కనిపిస్తున్నదని వర్మ చమత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement