
అక్కినేని నాగార్జున, రాంగోపాల్ వర్మ
వివాదస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పుట్టిన రోజు నేడు. కానీ, తనకు బర్త్ డే విషెస్ చెప్పడం లాంటివి నచ్చవని వర్మ తెలిపారు. అయితే ట్వీటర్ వేదికగా రాంగోపాల్ వర్మ నాగార్జునను విషెస్ చెప్పమని అడిగారు. వర్మ ట్వీట్ పై నాగార్జున వెంటనే స్పందించి బర్త్‌డే విషెస్ చెప్పారు. అంతేకాక నాగ్ వర్మ పుట్టిన రోజును మరచిపోయినట్లు తెలిపారు. నాగ్ విష్ చేయడంతో వర్మ ఖుషీ అయ్యారు.
ఆర్జీవీ బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమాకు సంబంధించి ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం( ఏప్రిల్ 9) ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.సాధారణంగా వేడుకలకు దూరంగా ఉండే వర్మ, తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. సోషల్ మీడియాలో వర్మకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment