అప్పుడు తప్పు చేసి.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు | Rape accused marries 22-year-old victim in Odisha | Sakshi
Sakshi News home page

అప్పుడు తప్పు చేసి.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు

Published Thu, Jan 29 2015 12:01 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

అప్పుడు తప్పు చేసి.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు - Sakshi

అప్పుడు తప్పు చేసి.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు

భువనేశ్వర్: అత్యాచారం చేసిన బాధితురాలి (22)ని నిందితుడు (32) పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి జైలు ఉన్నతాధికారులు, న్యాయవాదులతోపాటు వధువరుల బంధువులు సమక్షంలో ఒక్కటయ్యారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని జరపడ జైలు ఆవరణలో బుధవారం జరిగింది. నిందితుడు దిలీప్ బెహరా ట్యాక్సీ  డ్రైవర్గా  పని చేస్తున్నాడు. అయితే గతేడాది జనవరి 23న బస్సు కోసం వేచి ఉన్న యువతిని బలవంతంగా కారులో ఏక్కించుకుని... నగర శివారుల్లోకి తీసుకువెళ్లి...  ఆమెపై అత్యాచారం చేశాడు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు కేసు నమోదు చేసి...నిందితుడిని ఇటీవలే అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టాగా జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కాగా తాము ఇద్దరం వివాహబంధంతో ఒక్కటి కావాలని భావిస్తున్నామని... అందుకు అనుమతి ఇవ్వాలని బాధితురాలు, నిందితుడు సంయుక్తంగా జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో వారికి అనుమతి ఇస్తు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుధవారం వారిద్దరు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఒక్కటైయ్యారు. తనను జైలు నుంచి విడుదల చేయాలని దిలీప్ బెహరా కోర్టును అభ్యర్థించే అవకాశం ఉందని పెళ్లికూతురు తరపు న్యాయవాది తెలిపారు.  అయితే బుధవారం జరపడ జైలు ఆవరణ పెళ్లి సందడితో కళకళలాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement