అత్యాచారాలు జరిగాయి.. నిందితులను పట్టుకోండి! | rapes take place in murthal, find culprits, highcourt orders police | Sakshi
Sakshi News home page

అత్యాచారాలు జరిగాయి.. నిందితులను పట్టుకోండి!

Published Fri, Jan 20 2017 8:47 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

అత్యాచారాలు జరిగాయి.. నిందితులను పట్టుకోండి! - Sakshi

అత్యాచారాలు జరిగాయి.. నిందితులను పట్టుకోండి!

జాట్లను ఓబీసీలలో చేర్చాలంటూ 2016 ఫిబ్రవరిలో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా ముర్తాల్ సమీపంలో అత్యాచారాలు జరిగినట్లు పంజాబ్ హర్యానా హైకోర్టు నిర్ధారించింది. కొంతమంది సాక్షుల వాంగ్మూలాలను బట్టి, ఆ ప్రాంతంలో లభించిన మహిళల లోదుస్తులను బట్టి అక్కడ అత్యాచారాలు జరిగినట్లు ఖరారైందని తెలిపింది. పోలీసులు ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకోవాలని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించింది. 
 
ఈ మేరకు హైకోర్టు డివిజన్ బెంచి తన ఆదేశాలు జారీచేసింది. తమ వాహనాల్లోంచి కొందరు మహిళలను నిరసనకారులు లాక్కెళ్లిపోయారని ఒక టాక్సీ డ్రైవర్ కూడా చెప్పినట్లు న్యాయమూర్తి తెలిపారు. దాన్నిబట్టి అత్యాచారం జరిగిందని తెలుస్తోందన్నారు. ఈ విసయమై వార్తాపత్రికలలో కథనాలు రావడంతో హైకోర్టు ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన తర్వాత హరియాణా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తొలుత ఐదుగురిని ఈ అత్యాచారాల కేసుల్లో నిందితులుగా చూపించినా, వాళ్ల రక్తనమూనాలు.. ఘటనా స్థలంలో లభించిన లోదుస్తుల మీద ఉన్న వీర్య నమూనాలతో సరిపోలలేదు. దాంతో వారిపై ఆరోపణలు ఉపసంహరించుకున్నారు. 
 
ఈ కేసు విచారణకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తగిన విశ్వాసంతో పని చేయడం లేదని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది అనుపమ్ గుప్తా ఆరోపించారు. కావాలనే ఈ కేసును నీరుగార్చేందుకు సిట్ ప్రయత్నిస్తోందన్నారు. దాంతో, ఆరోపణలు ఉపసంహరించుకోవడం లేదని.. విచారణ కొనసాగుతోందంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉందో లేదో తెలియజేయాలని సీబీఐ తరఫు న్యాయవాదిని కూడా ధర్మాసనం కోరింది. సీబీఐ మీద ఇప్పటికే భారం ఎక్కువగా ఉన్నా, కోర్టు సూచనలను తప్పక పాటిస్తుందని సీబీఐ న్యాయవాది చెప్పారు. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 28న జరగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement