
బ్యాంకింగ్ యాప్స్ విషయంలో జాగ్రత్త: ఆర్‌బీఐ
ముంబై: బ్యాంకులకు సంబంధించిన యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఆర్‌బీఐ హెచ్చరించింది. యాప్స్‌ను సంబంధిత బ్యాంకులే రూపొందిం చాయా? లేదా? అనే విషయాన్ని వినియోగదారులు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అకౌంట్ వివరాలను తెలిపే ‘ఆల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ’ పేరుతో నెట్‌లో లభిస్తున్న మొబైల్ యాప్ రిజర్వ్‌బ్యాంక్ రూపొందించింది కాదని స్పష్టం చేసింది, బ్యాంకింగ్‌కు సంబంధించి తాము ఎలాంటి యాప్స్‌ను రూపొందించ లేదని తెలిపింది. తాము రూపొందించిన ట్లుగా ఆర్‌బీఐ లోగోతో ఉన్న ఒక యాప్ వాట్స్‌ఆప్‌లో చక్కర్లు కొడుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.