రూ.కోటిన్నరకు రియల్ వ్యాపారి ఐపీ..? | real businessman to make Rs 1 crore IP | Sakshi
Sakshi News home page

రూ.కోటిన్నరకు రియల్ వ్యాపారి ఐపీ..?

Published Mon, Sep 7 2015 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

real businessman to make Rs 1 crore IP

సూర్యాపేట(నల్లగొండ): రూ.కోటిన్నరకు ఐపీ పెట్టి ఓ వ్యక్తి ఉడాయించిన ఘటన సూర్యాపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. స్థానిక బాలాజీనగర్‌లోని మసీద్ సమీపంలో నివాసముంటున్న ఓ వ్యక్తి గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

వ్యాపారంలో రూ.కోటిన్నరకు పైగా అప్పులు చేసి ఐపీ పెట్టినట్టు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న అతనికి అప్పులు ఇచ్చిన వారు, ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఆయన నివాసం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగినట్టు తెలిసింది. ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన గురైనట్టు సమాచారం. దీంతో లక్షల్లో అప్పులు ఇచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించటంతో కుటుంబసభ్యులు అతడిని పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement