IP
-
ఐపీ ఫెసిలిటేటర్ల ఫీజులు పెంపు
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకు పేటెంట్ దరఖాస్తులపరమైన సేవలు అందించే ఐపీ ఫెసిలిటేటర్ల ప్రొఫెషనల్ ఫీజులను కేంద్రం దాదాపు రెట్టింపు చేసింది. స్టార్టప్స్ మేథోహక్కుల పరిరక్షణ (ఎస్ఐపీపీ) పథకం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంకుర సంస్థలకు ఐపీ ఫెసిలిటేటర్లు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని వివరించింది. పేటెంట్లకు సంబంధించి .. దరఖాస్తును ఫైలింగ్ చేసేటప్పుడు ఫీజును రూ. 10,000 నుండి రూ. 15,000కు పెంచారు. అలాగే ట్రేడ్ మార్క్‌లు, డిజైన్ల విషయంలో రూ. 2,000 నుండి రూ. 3,000కు సవరించారు. స్టార్టప్‌ల మేథోహక్కులను పరిరక్షించేందుకు, నవకల్పనలు.. సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016లో ఎస్ఐపీపీని ప్రవేశపెట్టింది. ఐపీ ఫెసిలిటేటర్ల ద్వారా అంకుర సంస్థలు తమ పేటెంట్లు, డిజైన్లు లేదా ట్రేడ్‌మార్కుల దరఖాస్తులు సమర్పించేందుకు, ప్రాసెస్ చేయించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన ఫీజులను ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్ భరిస్తోంది. దీని కింద ఐపీల ఫైలింగ్స్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ స్కీమును కేంద్రం పొడిగించింది. ఐపీ ఫైలింగ్స్‌లో స్టార్టప్‌లకు తోడ్పడినందుకు గాను సెప్టెంబర్ 30 వరకూ ఫెసిలిటేటర్లకు రూ. 3.80 కోట్ల మేర ఫీజులు చెల్లించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. -
నిమ్స్‌లో త్వరలో ఐపీ సేవలు
బీబీనగర్(భువనగిరి) : బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్ (ఐపీ) విభాగాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు. గురువారం నిమ్స్ భవనంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిమ్స్ భవనంలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించినట్లు తెలిపారు. జూన్‌లోపు నిర్మాణ పనులు పూర్తవుతాయని, తదుపరి మొదటి దశలో 13 విభాగాలతో, 250 పడకలతో ఇన్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. రెండో దశలో 700లకుపైగా పడకలతో ఇతర విభాగాలతో కూడిన పూర్తిస్థాయి ఆస్పత్రిని ప్రారంభించనున్నట్టు వివరించారు. మొదటి దశలో కావాల్సిన సదుపాయాలు, అవరమయ్యే నిధులపై ప్లాన్ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టు తెలిపారు. అంతకుముందు నిమ్స్ భవనంలో పూర్తయిన పనులు, పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో షూట్ చేయించిన ఎంపీ వాటిని సీఎంకు చూపించనున్నట్లు ఆయన తెలిపారు. ఎయిమ్స్ ఏర్పాటుకు కృషి బీబీనగర్‌లోనే ఎయిమ్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ నర్సయ్యగౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి కూడా మొగ్గు చూపుతున్నారని, కేంద్రానికి అందజేయాల్సిన స్థల సేకరణ ప్రతిపాదనలను రాష్ట్రంలోని ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ నుంచి కేంద్రానికి పంపించినట్టు తెలిపారు. బీబీనగర్‌లో ఏయిమ్స్ నిర్మాణానికి అనుకూలంగా ఉందని సీఏం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, నిమ్స్ సూపరింటెండెంట్ మహేశ్వర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అమరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్ తదితరులు ఉన్నారు. -
మేధోహక్కుల సూచీలో భారత్‌కు 44వ ర్యాంకు
వాషింగ్టన్: అంతర్జాతీయ మేధోహక్కుల (ఐపీ) సూచీలో భారత్ ర్యాంకింగ్ కొంత మెరుగుపడింది. 50 దేశాల జాబితాలో 44వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 45 దేశాల సూచీలో భారత్‌కు 43వ ర్యాంకు దక్కింది. స్కోరు కొంత మెరుగుపడినప్పటికీ .. ఈ సూచీలో భారత్ ఇంకా అట్టడుగు స్థానంలోనే ఉంది. అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్‌లో భాగమైన గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ) రూపొందించిన వార్షిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. స్థానాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు గాను... విధానాలకు అనుగుణంగా భారత్ మరిన్ని అర్ధవంతమైన సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుందని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. భారత్ గతేడాది కంప్యూటర్ ఆధారిత నవకల్పనలకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు.. నూతన సాంకేతిక ఆవిష్కరణలకు తోడ్పాటునిచ్చేలా ఉన్నాయని పేర్కొంది. అలాగే మేధోహక్కులపై అవగాహన పెంచేందుకు వర్క్‌షాపులు నిర్వహించడం, సాంకేతికాంశాల్లో శిక్షణనివ్వడం మొదలైనవి భారత్‌కు సానుకూలాంశాలని తెలిపింది. మేధోహక్కుల సూచీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా .. బ్రిటన్, స్వీడన్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
నమ్మితే మునిగినట్టే
కూతురు పెళ్లికి పనికొస్తాయని, సొంత ఇంటిని నిర్మించుకోవచ్చని, కొడుకు చదువుకు ఉపయోగపడుతుందని కొందరు మధ్యతరగతి ప్రజలు చీటీలు కడుతున్నారు. తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి నెల తిరిగే సరికి డబ్బు చెల్లిస్తున్నారు. చీటీల నిర్వాహకులు కొద్ది రోజులు బాగానే డబ్బులు ఇచ్చినా తర్వాత పెద్ద మొత్తంలో మోసం చేసి బిచానా ఎత్తేస్తున్నారు. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. మూడు నెలల క్రితం కొర్లగుంటలో నివాసం ఉంటు న్న ఓ వ్యక్తి టాక్సీ డ్రైవర్ల వద్ద చీటీలు వేయించుకున్నాడు. వారికి డబ్బులు ఇవ్వకుండా సుమారు రూ.కోటి ఎగరగొట్టాడు. బాధితులంతా ఈస్ట్ పోలీ సులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేశారు. తిరుపతి నగరంలోని సుందరయ్యనగర్‌లో నివాసం ఉంటు న్న మునిరత్నమ్మ చీటీలు నిర్వహిస్తోంది. సుమారు 50 మందికి పైగా చీటీలు వేశారు. వారు డబ్బులు అడగడంతో రూ.1.50 కోట్లు చెల్లించాల్సి వస్తుందని భావించి ఐపీ పిటిషన్ వేసింది. దీంతో చేసేది లేక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నాలుగు నెలల క్రితం ఎస్టీవీనగర్‌లో 30 మందికి పైగా ఓ మహిళను నమ్మి చీటీలు వేశారు. ఆమె రూ.40 లక్షలు మేర కట్టలేక పరారైంది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి, తిరుపతి క్రైం : చీటీల వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహించా లంటే ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. నిర్వాహకుల ఆస్తులు, ఆదాయ వనరులు, మార్కెట్లో వాటి విలువ తదితర అంశాలను నమోదు చేయా లి. చీటీల నిర్వాహణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ని యమించాలి. వారు పూర్తిగా నిబంధనలు పాటించాలి. ఈ నిభందనలు ఎక్కడా పాటించడం లేదు. మాటలే పెట్టుబడిగా... కొందరు చుట్టుపక్కల వారితో కలివిడిగా ఉంటూ నమ్మకం పొందుతున్నారు. తర్వాత చీటీలు వేస్తున్నారు. కొద్ది రోజులు బాగానే జరిపి పెద్ద మొత్తంలో చేతికి అందగానే రాత్రికి రాత్రికే బిచానా ఎత్తేస్తున్నారు. ఇలాంటి అనధికార చీటీల వ్యాపారంపై నిఘాలేకపోవడంతో మోసాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఐపీ ఆయుధం చీటీ వేసే నిర్వాహకులకు అడ్డూ అదుపూ లేకుండా పోవడానికి కారణం ఐపీ ఆయుధం. దీన్ని ఆసరాగా తీసుకుని నిర్వహకులు అవసరాన్ని బట్టి చీటీలు ఎగ్గొట్టి స్థానిక పోలీసుల ద్వారా ఐపీ నోటీసులు పంపిస్తున్నారు. కొంతమంది పోలీసులు కూడా కాసులకు కక్కుర్తి పడి అలాంటి వారికే కొమ్ముకాస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐపీ నోటీసు రాగానే నిర్వాహకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. దీంతో వారు కాలర్ ఎగురవేసుకుంటూ బయట దర్జాగా తిరుగుతున్నారు. ప్రజల్లో మార్పు రావాలి రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహించే చీటీల వల్ల ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. మొదట్లో నమ్మకంగా ప్రారంభించి అనంతరం పరారైపోతున్న సంఘటనలు ఎన్నో ఉంటున్నాయి. కష్టపడి దాచుకున్న డబ్బులు పోతే చాలా బాధగా ఉంటుంది. మధ్యతరగతి, నిరుపేదలే ఎక్కువగా మోసపోతున్నారు. ఆర్బీఐ సూచనల మేరకు నమోదైన చీటీల çసంస్థలో సమస్య ఉంటే న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అనధికారిక చీటీలు నడిపే వారిపై సమాచారం ఇస్తే కఠినంగా వ్యవహరిస్తాం. – అభిషేక్ మొహంతి, అర్బన్ జిల్లా ఎస్పీ -
చీరాల.. ఐపీ ఖిల్లా
► పక్కాగా నమ్మించి డబ్బు తీసుకుని మోసం ► రూ.7 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన ఓ ఫైనాన్స్ వ్యాపారి ► వడ్డీలకు ఆశపడి అసలు కూడా నష్టపోతున్న అభాగ్యులు చీరాల : చీరాల పట్టణం మోసాలకు అడ్డాగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు రకరకాల మోసాలు. మోసపోయేవాళ్లు ఉండాలేగానీ మోసం చేయడానికి మాత్రం ఇక్కడ కోకొల్లలుగా ఉంటారు. కాకపోతే.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ప్రస్తుతం చీరాల్లో ఐపీ మోసాలు కొనసాగుతున్నాయి. ఐపీలు పెట్టేవారు రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపారం కోసం అప్పులు తెస్తారు. చాలామంది వ్యాపారులు, చిరువ్యాపారులు దాచుకున్న డబ్బు బ్యాంకుల్లో వేసుకుంటే వడ్డీ తక్కువ వస్తుందని భావించి ఎక్కువ వడ్డీ కోసం ఆశపడి అడిగిందే తడవుగా మోసగాళ్లకు అప్పులిస్తారు. కొన్ని రోజులు నమ్మకంగా వడ్డీలు చెల్లించే మోసగాళ్లు.. ఎక్కువ మంది వద్ద కోట్లాది రూపాయలు అప్పు చేసి చివరకు ఐపీ పేరుతో అప్పులిచ్చిన వారికి కుచ్చుటోపీ పెడతారు. వడ్డీ సంగతి అలా ఉంచితే.. చివరకు అసలు కూడా కోల్పోయి అప్పులిచ్చిన వారు రోడ్డున పడతారు. ఈ తరహా మోసాలు ప్రస్తుతం చీరాల్లో అధికంగా జరుగుతున్నాయి. ఫైనాన్స్ వ్యాపారం పేరుతో దగా... స్థానిక ఎంజీసీ మార్కెట్లో ఒక వ్యక్తి దశాబ్ద కాలంగా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. చాలాకాలంగా వ్యాపారం చేస్తుండటంతో స్థానిక వ్యాపారులతో పాటు పట్టణంలోని మధ్యతరగతి కుటుంబాల వారు సైతం అడిగిందే తడవుగా అతనికి అప్పులిచ్చారు. అలాగే నోట్ల రద్దు సమయంలో ఎక్కువ మొత్తంలో వ్యాపారులు ఫైనాన్స్ రూపంలో ఇచ్చేశారు. జనం వద్ద రూ.100కి రూ.2 చొప్పున వడ్డీకి తీసుకుని అతను మాత్రం ఇతరులకు రూ.100కి రూ.4 నుంచి రూ.5 వరకు వడ్డీకి ఇచ్చి వసూలు చేసేవాడు. తనవద్ద అప్పు తీసుకున్న వారు ఎవరైనా సకాలంలో డబ్బు చెల్లించకుంటే అంతే సంగతులు. తనవద్ద ఉండే యువకులను పంపి బెదిరించి భయపెట్టి వసూలు చేసేవాడు. అలా కోట్లలోనే వడ్డీలకు తిప్పేవాడు. ఫైనాన్స్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. అయితే ఏమైందోఏమోగానీ కొద్దిరోజుల క్రితం ఏకంగా రూ.7 కోట్లకు ఎగనామం పెట్టి కనిపించకుండా పోయాడు. దీంతో అతనికి అప్పులు ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు. బాగా సంపాదించాడు కదా తాము ఇచ్చిన డబ్బులో అసలైనా వస్తాయని ఆశించారు. కానీ, అప్పులిచ్చిన వారికి కొద్దిరోజులకు ఐపీ నోటీసులు ఇంటికి పంపాడు. మొత్తం రూ.7 కోట్లకుగానూ రూ.5 కోట్లకు ఐపీ నోటీసులు పంపినట్లు సమాచారం. కొద్దిరోజులు మొహం చాటేసిన ఆ ఫైనాన్స్ వ్యాపారి.. ఐపీ నోటీసులు ఇచ్చిన తరువాత మరలా చీరాల వచ్చి తనకు రావాల్సిన బకాయిలను దర్జాగా వసూలు చేసుకుంటున్నాడు. అయితే ఈ ఫైనాన్స్ వ్యాపారి జనం సొమ్మును కొంత దాచిపెట్టడంతో పాటు మరికొంత సొమ్ముతో తన తనయుడితో వ్యాపారం చేసుకునేందుకు వచ్చినట్లు సమాచారం. అంటే జనం సొమ్ముతో జల్సా అన్నమాట. మోసగాళ్లు ఎంతో మంది... నమ్మించి అప్పుచేయడం.. ఆ తరువాత కోట్లకు ఐపీలు పెట్టి మోసం చేయడం. చీరాల్లో చాలామందికి ఇది పరిపాటిగా మారింది. ప్రస్తుతం పట్టణంలోని ఒక వస్త్రవ్యాపారి తనయుడు ఒక ప్రైవేట్ వైద్యశాలలో వాటాదారుడిగా ఉండి రూ.3 కోట్లకుపైగా ఐపీ పెట్టినట్లు సమాచారం. సదరు వ్యాపారి కొద్దిరోజులుగా చీరాలలో కనిపించకుండా వేరే ప్రాతంలో తిరుగుతున్నట్లు సమాచారం. అప్పులిచ్చిన వ్యక్తులు అతని కోసం తిరుగుతున్నారు. అలాగే గొల్లపాలేనికి చెందిన వస్త్రవ్యాపారి కూడా కొద్దిరోజుల క్రితం రాత్రికిరాత్రే తన దుకాణంలోని వస్త్రాలను బయటకు పంపి దుకాణం మూసేశాడు. సదరు వ్యాపారి అప్పులిచ్చిన వారికి రూ.2 కోట్లకు ఎగనామం పెట్టేశాడు. కేవలం ఎక్కువ వడ్డీ వస్తుందని అశపడిన చాలామంది జనం చీరాల్లో ఐపీల బారినపడి చివరకు రోడ్డున పడుతున్నారు. రోడ్డున పడిన బాధితులు... ఐపీ పెట్టిన ఫైనాన్స్ వ్యాపారికి కొంతమంది వస్త్రవ్యాపారులు అప్పులివ్వగా చాలామంది మాత్రం చిరువ్యాపారులు, మధ్య తరగతి వారు ఉన్నారు. ముంతావారిసెంటర్లో రోడ్ల పక్కన హోటళ్లు, ఇతర చిరువ్యాపారులు చేసేవారు తీవ్రంగా మోసపోయారు. ఒకరు తన కూతురు వివాహం కోసం అక్కరకు వస్తాయని ఆశించి ఇచ్చిన డబ్బును మోసపోయారు. బ్యాంకులో ఇస్తే రూపాయి కూడా వడ్డీ రాదని భావించి రూ.2 వడ్డీకి ఫైనాన్స్ వ్యాపారికి ఇచ్చి అన్యాయమయ్యారు. ఐపీ నోటీసులు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచక అల్లాడుతున్నారు. వడ్డీవద్దు.. అసలైనా ఇప్పించండని వేడుకుంటున్నారు. -
ఐపీ పెట్టి పరార్, రైతులని నట్టేట ముంచేశాడు
-
రూ.కోటిన్నరకు రియల్ వ్యాపారి ఐపీ..?
సూర్యాపేట(నల్లగొండ): రూ.కోటిన్నరకు ఐపీ పెట్టి ఓ వ్యక్తి ఉడాయించిన ఘటన సూర్యాపేట పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. స్థానిక బాలాజీనగర్‌లోని మసీద్ సమీపంలో నివాసముంటున్న ఓ వ్యక్తి గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో రూ.కోటిన్నరకు పైగా అప్పులు చేసి ఐపీ పెట్టినట్టు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న అతనికి అప్పులు ఇచ్చిన వారు, ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఆయన నివాసం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగినట్టు తెలిసింది. ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన గురైనట్టు సమాచారం. దీంతో లక్షల్లో అప్పులు ఇచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించటంతో కుటుంబసభ్యులు అతడిని పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. -
రూ.కోటి మేర ఐపీ పెట్టిన వైద్యుడు
నేరేడ్మెట్ (హైదరాబాద్): ఆస్పత్రి అభివృద్ధి కోసమని దాదాపు రూ.కోటి అప్పుగా తీసుకుని, ఆపై ఐపీ నోటీసులు పంపాడు ఓ వైద్యుడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. డాక్టర్ విజయ్ (40) కొన్నేళ్లుగా నేరేడ్మెట్ ప్రాంతంలో దంత వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. మంచిగా సేవలందిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అయితే, కొంతకాలంగా ఆస్పత్రి అభివృద్ధి కోసమంటూ తెలిసిన సుమారు 15 మంది వద్ద నుంచి రూ.కోటి వరకు అప్పుగా తీసుకున్నాడు. ఇవి కాకుండా బ్యాంక్‌లు, ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.80 లక్షల వరకు ఆయనకు అప్పు ఉంది. బ్యాంకులు, అప్పులు ఇచ్చిన వారికి కొంతకాలంపాటు వడ్డీ సక్రమంగా చెల్లించాడు. ఆ తర్వాత ఆస్పత్రిని మూసి వేసి విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలిసింది. కొందరు రుణ దాతలకు ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లలేదు. దీంతో బాధితులు నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా వారం క్రితం డబ్బులు ఇచ్చిన వారికి విజయ్ దివాలా తీసినట్లు (ఐపీ) నోటీసులు పంపాడు. దీంతో బాధితులంతా లబోదిబో మంటున్నారు. -
అప్పు తెచ్చి.. ఐపీ పెట్టి!
పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చిన్న చిన్న వ్యాపారులే దివాళ తీసి ఐపీ పెట్టి ఊరు విడిచి వెళ్లారు. ఈమధ్యకాలంలో వరుసగా పెద్ద పెద్ద వ్యాపారులు ఐపీ పెట్టి పారిపోతున్నారు. తమకున్న పలుకుబడి మాట, మంచితనం వీటన్నిటిని ఆసరా చేసుకుని చుట్టాలు, బంధువులు, స్నేహితుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులుతీసుకున్న వారు ఊరువిడిచి ఊడాయిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో నలుగురు ప్రముఖులు చేతిలెత్తిన సంఘటనలు సంచలనం రేపుతున్నాయి. కాసులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు సదాల లక్ష్మయ్య సౌమ్యుడు కావ డంతో ఇరుగుపొరుగు వారు రూ.2 కోట్ల వరకు అప్పులిచ్చారు. ఆయన చేసిన క్రషర్దందాలో నష్టం రావడంతో ఊరు విడిచి వెళ్లిపోయారు. జాడ కనుక్కోవడానికి బంధువులు వెతుకులాట ప్రారంభించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన డ్రాయర్ బనియన్ల హోల్‌సెల్ షాప్ యజమాని రూ.3 కోట్లకుపైగా అప్పులు చేసి భార్యాపిల్లలతో వెళ్లిపోయూరు. ఆయన అప్పు తీసుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, కొడుకు కో డలు నలుగురివద్ద ఒక్కోరి నుంచి రూ.10 లక్షల చొప్పున అప్పులు తీసుకున్నారు. మరో వడ్డీ వ్యాపారిని మధ్యవర్తిగా పెట్టి రూ.2 కు వడ్డికి తెచ్చి రూ.3 చొప్పున మధ్యవర్తిద్వారా తీసుకుని మరీ ఉడారుుంచారు. బ్యాంకులో వేస్తే వడ్డి రూపాయలు చిల్లరకు కూడా కావని తాను రూ.2 నుంచి రూ.3 వరకు ఆశచూపడంతో ఎగబడి అప్పులిచ్చారు. ఇక పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు రూ.10 కోట్ల వరకు అప్పులు పుట్టించి పొరుగు రాష్ట్రాల్లో రియల్వ్యాపారంలో న ష్టపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇచ్చిన అసలుకు వడ్డీ అవసరం లేదు. కనీసం అసలైనా ఇప్పించడండి అంటూ బాధితులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పు తీసుకున్న సదరు వైద్యుడు మాత్రం అసలులో ఎంత తగ్గిస్తారంటూ బేరం ఆడుతున్నట్లు సమాచారం. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన మరో వ్యాపారి రూ.4 కోట్ల వరకు అప్పు చేశాడు. ఆయన ఆస్తులు మొత్తం రూ.2 కోట్లే ఉండడంతో కనీసం సగంతో సరిపుచ్చుకుందామంటూ బేరసారాలు నడుపుతున్నారు. కొంప ముంచుతున్న షేర్ మార్కెట్... దివాలతీసిన వారిలో షేర్ మార్కెట్లో లక్షలాది రూపాయలు వెచ్చించి నష్టాల బారిన పడడంతో వాటిని పూడ్చుకునేందుకు మరిన్ని అప్పులుచేసి షేర్ మార్కెట్లోపెట్టి నష్టపోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నష్టపోయిన నలుగురిలో ఇద్దరు షేర్ మార్కెట్ దందాలో చేతులుకాల్చుకున్న వారే కావడం విశేషం. చిన్న వ్యాపారులకు వడ్డీలకు ఇస్తే ముంచుతారని పెద్దవ్యాపారులను నమ్మితే అసలుకే సగంవచ్చే దిక్కులేకుండా పోయింది. -
రూ.64.70 లక్షలకు ఐపీ
ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: నగరానికి చెందిన చిట్‌ఫండ్ వ్యాపారులైన షేక్ అబ్దుల్ రషీద్-షేక్ రషీద్బేగం దంపతులు 64.70లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మంగళవారం దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారు. మొత్తం ఎనిమిదిమంది రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మొదటి ఇద్దరు ప్రతివాదులైన కాంతాలి శ్రీనివాసరావు-పద్మ దంపతులకు 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సుందని పేర్కొన్నారు. పిటిషన్లో తెలిపిన ప్రకారం.. షేక్ అబ్దుల్ రషీద్-షేక్ రషీద్బేగం దంపతులు ఖమ్మంలో చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించేవారు. వ్యాపార అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. చిట్టీలు పాడుకున్న వారు డబ్బును వాయిదాల ప్రకారం చెల్లించకపోవడంతో వ్యాపారంలో నష్టపోయారు. అప్పులు తీర్చలేక, ప్రతివాదుల ఒత్తిళ్లు తట్టుకోలేక దివాళ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్‌దారుల తరఫున న్యాయవాదులుగా తాళ్ళూరి దిలీప్, రావుల వెంకట్ వ్యవహరిస్తున్నారు. రూ.7.3లక్షలకు మరో వ్యాపారి... రఘునాధపాలెం మండలంలోని రుద్రంకోట గ్రామానికి చెందిన పసుపులేటి అప్పారావు 7.03లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మంగళవారం దివాలా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 12మంది రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషన్లో తెలిపిన ప్రకారం.. పిటిషన్‌దారుడైన పసుపులేటి అప్పారావు ఖమ్మం చుట్టుపక్కల గేదెల వ్యాపారం నిర్వహించేవాడు. ఇందుకోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చాడు. ఆ తరువాత గేదెలు చనిపోవడం, వ్యాపారంలో ఒడుదుడుకులు వచ్చాయి. దీంతో అప్పులు తీర్చలేకపోయాడు. ప్రతివాదుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమవడంతో తనను దివాలా తీసినట్టుగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ దివాలా పిటిషన్ దాఖ లు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాదుదిగా కన్నెబోయిన నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. -
పెరుగుతున్న ‘దివాలా’ కేసులు
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: ఐపీ (ఇన్సాల్వెన్సీ పిటిషన్-దివాలా అర్జీ)... ఇటీవలి కాలంలో నేర వార్తల్లో తరచూ కనిపిస్తున్న, రుణ దాతలను కలవరపెడుతున్న పదమిది. లక్షల్లో, కోట్లల్లో అప్పులు చేసి.. ‘ఆర్థికంగా దివాలా తీశాను. అప్పులు చెల్లించలేకపోతున్నాను. దివాలా తీసినట్టుగా ప్రకటించాలి’ అని కోర్టును అర్థిస్తూ ఇటీవలి కాలంలో దివాలా అర్జీలు తరచూ దాఖలవుతున్నాయి. ఈ దివాలా అర్జీదారుల బాధితులు (రుణ దాతలు).. తమ నెత్తిన టోపీ పడిందంటూ లబోదిబోమంటున్నారు. వ్యాపారులే అధికం.. కోర్టులో ఐపీ పెడుతున్న వారిలో ఎక్కువమంది ఖమ్మం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని రియల్టర్లు, బంగారపు వర్తకులు, ఫైనాన్స్ వ్యాపారులు, మధ్య తరగతికి చెందిన (పాలు, కిరాణా, సిమెంట్, కమీషన్) వ్యాపారులు ఉంటున్నారు. గత ఐదారు నెలల్లో ఐపీ పెట్టిన వారి సంఖ్య సుమారు 60కి పైగానే ఉండవచ్చని అంచనా. వీరిలో నిజంగా దివాలా తీసిన వారు ఎక్కువమందే ఉంటున్నారని, ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయన్న’ సామెతగా, ఒకప్పుడు భోగాభాగ్యాలు అనుభవించిన వారు.. కాలం కలిసిరాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, మార్గాంతరం కానరాక ఐపీ వైపు మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకిలా...?! ఐపీ పెట్టాల్సిన పరిస్థితి రావడానికి అత్యాశ, అజాగ్రత్త, అవగాహన లేమి కారణమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు వ్యాపారం చేద్దామనుకుని, ఆస్తిపాస్తులన్నీ అమ్ముకుని నగరానికి వలస వచ్చి, ఏమీ చేయలేక క్రమేణా ఆర్థిక ఇబ్బందుల్లో.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇటీవలి కాలంలో ఐపీ పెట్టిన వారిలో ఖమ్మం-పరిసరాలకు చెందిన మధ్య తరగతి వ్యాపారులు ఎక్కువమంది ఉన్నారు. గత ఏడాది వరకు ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగింది. ఈ రంగంలోకి దిగిన మధ్యతరగతికి చెందిన కొందరు.. కొద్ది కాలంలోనే వ్యాపారంలో స్తబ్దత ఏర్పడడంతో.. కొన్న భూములు/స్థలాలు/ఫ్లాట్లు తిరిగి అమ్మలేక, తెచ్చిన అప్పులు తీర్చలేక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. ఇతర రంగాల్లోని (బంగారు, వ్యవసాయోత్పత్తుల కమీషన్ తదితర) వ్యాపారులదీ ఇదే పరిస్థితని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేస్తే... మనవే కాదు.. ఎదుటి వారి అనుభవాలనూ పాఠాలుగా.. గుణపాఠాలుగా భావించి, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఐపీ పెట్టాల్సిన.. అప్పులిచ్చి లబోదిబోమనాల్సిన పరిస్థితికి దూరంగా ఉండవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. సహజంగానే ప్రతి వ్యాపార రంగంలోనూ లాభ నష్టాలుంటాయి. నష్టం వస్తే తట్టుకునే స్థాయిని అంచనా వేసుకుని, తదనుగుణ జాగ్రత్తలు తీసుకుంటే ఐపీ పెట్టాల్సిన స్థితి రాకుండా చూసుకోవచ్చని సూచిస్తున్నారు. రుణదాతలు కూడా.. అప్పులు ఇచ్చేప్పుడు గ్రహీతల నేపథ్యం, వ్యాపార దక్షత, ఆర్థిక ఒడుదుడుకులను తట్టుకునే శక్తి తదితరాలను దృష్టిలో ఉంచుకుంటే మంచిదని పరిశీలకులు చెబుతున్నారు.