పెద్దపల్లి: పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు చిన్న చిన్న వ్యాపారులే దివాళ తీసి ఐపీ పెట్టి ఊరు విడిచి వెళ్లారు. ఈమధ్యకాలంలో వరుసగా పెద్ద పెద్ద వ్యాపారులు ఐపీ పెట్టి పారిపోతున్నారు. తమకున్న పలుకుబడి మాట, మంచితనం వీటన్నిటిని ఆసరా చేసుకుని చుట్టాలు, బంధువులు, స్నేహితుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులుతీసుకున్న వారు ఊరువిడిచి ఊడాయిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో నలుగురు ప్రముఖులు చేతిలెత్తిన సంఘటనలు సంచలనం రేపుతున్నాయి. కాసులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు సదాల లక్ష్మయ్య సౌమ్యుడు కావ డంతో ఇరుగుపొరుగు వారు రూ.2 కోట్ల వరకు అప్పులిచ్చారు. ఆయన చేసిన క్రషర్‌దందాలో నష్టం రావడంతో ఊరు విడిచి వెళ్లిపోయారు.
జాడ కనుక్కోవడానికి బంధువులు వెతుకులాట ప్రారంభించారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన డ్రాయర్ బనియన్ల హోల్‌సెల్ షాప్ యజమాని రూ.3 కోట్లకుపైగా అప్పులు చేసి భార్యాపిల్లలతో వెళ్లిపోయూరు. ఆయన అప్పు తీసుకున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, కొడుకు కో డలు నలుగురివద్ద ఒక్కోరి నుంచి రూ.10 లక్షల చొప్పున అప్పులు తీసుకున్నారు. మరో వడ్డీ వ్యాపారిని మధ్యవర్తిగా పెట్టి రూ.2 కు వడ్డికి తెచ్చి రూ.3 చొప్పున మధ్యవర్తిద్వారా తీసుకుని మరీ ఉడారుుంచారు. బ్యాంకులో వేస్తే వడ్డి రూపాయలు చిల్లరకు కూడా కావని తాను రూ.2 నుంచి రూ.3 వరకు ఆశచూపడంతో ఎగబడి అప్పులిచ్చారు. ఇక పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు రూ.10 కోట్ల వరకు అప్పులు పుట్టించి పొరుగు రాష్ట్రాల్లో రియల్‌వ్యాపారంలో న ష్టపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇచ్చిన అసలుకు వడ్డీ అవసరం లేదు.
కనీసం అసలైనా ఇప్పించడండి అంటూ బాధితులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పు తీసుకున్న సదరు వైద్యుడు మాత్రం అసలులో ఎంత తగ్గిస్తారంటూ బేరం ఆడుతున్నట్లు సమాచారం. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన మరో వ్యాపారి రూ.4 కోట్ల వరకు అప్పు చేశాడు. ఆయన ఆస్తులు మొత్తం రూ.2 కోట్లే ఉండడంతో కనీసం సగంతో సరిపుచ్చుకుందామంటూ బేరసారాలు నడుపుతున్నారు.
కొంప ముంచుతున్న షేర్ మార్కెట్...
దివాలతీసిన వారిలో షేర్ మార్కెట్లో లక్షలాది రూపాయలు వెచ్చించి నష్టాల బారిన పడడంతో వాటిని పూడ్చుకునేందుకు మరిన్ని అప్పులుచేసి షేర్ మార్కెట్లోపెట్టి నష్టపోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నష్టపోయిన నలుగురిలో ఇద్దరు షేర్ మార్కెట్ దందాలో చేతులుకాల్చుకున్న వారే కావడం విశేషం. చిన్న వ్యాపారులకు వడ్డీలకు ఇస్తే ముంచుతారని పెద్దవ్యాపారులను నమ్మితే అసలుకే సగంవచ్చే దిక్కులేకుండా పోయింది.
అప్పు తెచ్చి.. ఐపీ పెట్టి!
Published Fri, May 8 2015 4:12 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement