న్యూఢిల్లీ: త్వరలో 4జీ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. భారీ ప్రణాళికల్లో ఉంది. ప్రస్తుత 3జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 10-12 రెట్ల అధిక స్పీడ్‌తో డేటా ప్రసారాన్ని అందించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో... దేశవ్యాప్త వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రయోగాత్మకంగా తాము సెకనుకు 49 మెగాబైట్ల(ఎంబీపీఎస్) డౌన్‌లోడ్ స్పీడ్‌ను, 8-9 ఎంబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్‌ను అందుకున్నామని రిలయన్స్ జియో అధికారి చెప్పారు. ఇదే వ్యవస్థతో గరిష్టంగా 112 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగాన్నికూడా చేరొచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 3జీ నెట్‌వర్క్‌లో సగటు గరిష్ట స్పీడ్ 4 ఎంబీపీఎస్‌గా అంచనా.