ప్రత్యేక కోర్టులో ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి పిటిషన్
దర్యాప్తు పూర్తికాకుండా తుది విచారణతో మా హక్కులకు భంగం
కౌంటర్ దాఖలుకు ఈడీని ఆదేశించిన ప్రత్యేక కోర్టు
హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి ఈడీ నమోదు చేసిన ఈసీఐఆర్‌లో దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించేలా ఆదేశించాలని ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్ల ఆధారంగానే ఈడీ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో వారి దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టం చే యాలని కోరారు. ఈ మేరకు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో నేర విచారణ చట్టం సెక్షన్ 156 (3) రెడ్‌విత్ 159 కింద ఆయన సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి న్యాయస్థానం ముందు హాజరయ్యారు.
‘‘ఒక అంశంపై దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా తుది విచారణ ప్రారంభిస్తే నిందితుల హక్కులకు విఘాతం కలుగుతుంది. అందువల్ల దర్యాప్తు ఏ దశలో ఉందో స్పష్టం చేస్తూ నివేదిక సమర్పించేలా ఈడీని ఆదేశించండి’’ అని సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి నివేదించారు. ‘‘ఒక అంశానికి సంబంధించి దర్యాప్తు పూర్తయింది. చార్జిషీట్ దాఖలు చేశాం. భవిష్యత్తులో ఈ అంశానికి సంబంధించి చార్జిషీట్లు దాఖలు చేయం’’ అని ఈడీ తరఫు న్యాయవాది నివేదించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి టి.రజని.. సాయిరెడ్డి అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు.
ఈడీ దర్యాప్తుపై నివేదిక కోరండి
Published Tue, Jul 21 2015 1:09 AM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM
Advertisement