సిరియా మీద సైనిక దాడి జరగకుండా చూడాలని అంతర్జాతీయ సమాజానికి రష్యా పార్లమెంటు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అమెరికా గనక సైనిక దాడికి తెగబడితే, ఈ ప్రాంతంలో సుస్థిరత దెబ్బ తింటుందని హెచ్చరించింది. సిరియా మీద దాడి చేస్తే ఈ ప్రాంతంలో అణు, రసాయన భద్రత సర్వనాశనం అవుతుందని, దీనివల్ల మరింతమంది పౌరులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. సిరియాలో దానివల్ల మానవ విధ్వంసం జరిగి తీరుతుందని రష్యన్ పార్లమెంటు డుమా చెప్పినట్లు సిన్హువా వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది.
అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా ఈ విపత్తును నివారించడానికి అమెరికన్ కాంగ్రెస్తో పాటు అన్ని దేశాల పార్లమెంటులూ ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులకు అనుకూలంగా ఓటు వేయకూడదని డుమా కోరింది. సిరియన్ అంతర్గత తగాదాల నివారణకు శాంతియుత మార్గాలు ఏవైనా ఉంటే చూడాలని తెలిపింది. వేసవి సెలవుల తర్వాత డుమా ఆమోదించిన మొదటి డాక్యుమెంటు ఇదే. సైనిక దాడికి పాల్పడటం అనేది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, అందువల్ల అది నేరమే అవుతుందని తెలిపింది.
సిరియాపై దాడిని నివారించండి: రష్యన్ పార్లమెంటు
Published Thu, Sep 12 2013 10:37 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM
Advertisement