మొబైల్ మార్కెట్లో శామ్‌సంగ్ నంబర్ వన్
మొబైల్ మార్కెట్లో శామ్‌సంగ్ నంబర్ వన్
Published Wed, Aug 21 2013 2:35 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
ముంబై: స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ జోరుగా ఉండటంతో గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ 15 శాతం వృద్ధితో రూ.35,946 కోట్లకు చేరచ్చని వాయిస్ అండ్ డేటా సర్వే అంచనా వేస్తోంది. భారత్‌లో ఫీచర్ ఫోన్లు, మల్టీమీడియా ఫోన్లు, ఎంటర్‌ప్రైజ్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్‌లు విక్రయించే 30కు పైగా మొబైల్ కంపెనీలపై నిర్వహించిన ఈ 18వ వార్షిక వీ అండ్ డీ 100 సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం..,
2011-12 ఆర్థిక సంవత్సరంలో ఈ మార్కెట్ విలువ రూ.31,300 కోట్లు.
శామ్‌సంగ్ భారత్ మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ ఫోన్ల ధరలు రూ.1,500 నుంచి రూ.50,000 రేంజ్‌లో ఉన్నాయి. 2011-12లో రూ.7,891 కోట్లుగా ఉన్న శామ్‌సంగ్ ఆదాయం 2012-13లో 44 శాతం వృద్ధితో రూ.11,328 కోట్లకు చేరింది. 32 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. నోకియా 27.2% మార్కెట్ వాటా తో రెండో స్థానానికి దిగజారింది. 2011-12లో రూ.11,925 కోట్లుగా ఉన్న నోకియా భారత ఆదాయం 2012-13లో రూ.9,780 కోట్లకు తగ్గింది. కాగా యాపిల్ 417% వృద్ధి చెందింది.
Advertisement