ఆ యువతి మినీస్కర్ట్‌ వేసుకుందని..! | Saudi woman arrested | Sakshi
Sakshi News home page

ఆ యువతి మినీస్కర్ట్‌ వేసుకుందని..!

Published Wed, Jul 19 2017 8:54 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

ఆ యువతి మినీస్కర్ట్‌ వేసుకుందని..! - Sakshi

ఆ యువతి మినీస్కర్ట్‌ వేసుకుందని..!

మినీ స్కర్ట్‌ ధరించి బహిరంగ ప్రదేశంలో తిరగడమే ఆ యువతి తప్పైంది. ఓ చారిత్రక ప్రదేశంలో మినీ స్కర్ట్‌ వేసుకొని వెంట్రుకలు కనిపించేలా తిరిగినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. సౌదీ అరేబియాలో ఈ ఘటన జరిగింది. సంప్రదాయికమైన ఇస్లామిక్‌ డ్రెస్‌ కోడ్‌ను ఆమె ఉల్లంఘించిందంటూ ప్రజలు ఆ యువతిపై మండిపడుతున్నారు.

అసభ్య దుస్తులు ధరించిందంటూ మంగళవారం సౌదీ రాజధాని రియాద్‌లో యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె కేసును దేశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అప్పగించారని ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. గతవారం ఆ యువతి స్నాప్‌చాట్‌లో పెట్టిన వీడియోను చాలామంది చూశారు. వెంట్రుకలను స్వేచ్ఛగా వదిలేసి.. మినీ స్కర్ట్‌, క్రాప్‌ టాప్‌ ధరించిన ఆమె ఓ చారిత్రక ప్రదేశాన్ని వీక్షిస్తున్న వీడియోను పోస్టు చేశారు. ఇస్లామిక్‌ రాజ్యమైన సౌదీ అరేబియాలో వస్త్రధారణపై కఠినమైన ఆంక్షలు ఉంటాయి. ముఖ్యంగా మహిళలు తల నుంచి కాళ్ల వరకు కనిపించకుండా ఉండేలా, ముఖం కనిపించకుండా దుస్తులు ధరించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement