ఎన్సీఎంఎల్తో ఎస్బీహెచ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పంట పండించి, అమ్ముకునే వరకు వివిధ దశల్లో అవసరమైన మొత్తాన్ని సమకూర్చడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ముందుకొచ్చింది. ఇందుకోసం అగ్రి ఇన్ఫ్రా కంపెనీ నేషనల్ కోల్లేటరల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఎన్సీఎంఎల్)తో ఎస్బీహెచ్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రైతులు గొడౌన్లలో దాచుకున్న సరుకుపై కూడా రుణం పొందే వీలవుతుందని ఎన్సీఎంల్ ఎండీ, సీఈవో సంజయ్కౌల్ తెలిపారు.