ఆంబే వాలీ అమ్మకానికి రంగం సిద్ధం | SC orders auction of Sahara's Aamby Valley over the business conglomerate's alleged failure to deposit money for refunding to its investors | Sakshi
Sakshi News home page

ఆంబేవాలీ అమ్మకానికి రంగం సిద్ధం

Published Mon, Apr 17 2017 3:01 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఆంబే వాలీ అమ్మకానికి రంగం సిద్ధం - Sakshi

ఆంబే వాలీ అమ్మకానికి రంగం సిద్ధం

న్యూఢిల్లీ: సహారాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. సహారా అధిపతి సుబ్రతోరాయ్‌కి చెందిన విలువైన ఆస్తిని  వేలం వేయాలని  ఆదేశించి సుప్రీంకోర్టు ఆయకు గట్టి షాకిచ్చింది.  డబ్బులు చెల్లించని పక్షంలో వేలం వేస్తామని గతంలో తీవ్రంగా హెచ్చరించిన సుప్రీం వేలానికి  సోమవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  ముంబైలోని  సహారా గ్రూప్కు చెందిన అత్యంత విలువైన ఆస్తి ఆంబే వాలీని వేలం వేయాలని సుప్రీంకోర్టు  స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచరాణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది. అలాగే సహారా అధిపతి  సుబ్రతో వ్యక్తిగతంగా  ఏప్రిల్‌ 28న కోర్టుముందు హాజరు కావాలని ఆదేశించింది.

రూ. 300 కోట్లను చెల్లించడంలో  సహారాసంస్థ విఫలమైన నేపథ్యంలో ఈ ఆస్తిని వేలం  వేయాలని తీర్పు  చెప్పింది.  దీనికి సంబంధించి  ముంబై హైకోర్టుప్రతినిధి అధికారికి లిక్విడేటర్‌ గా నియమించింది.  గ్రూప్లోని రెండు కంపెనీలు ఇన్వెస్టర్లకు చెల్లించాల్సి ఉన్న రూ.39వేల కోట్లు విలువైన ఆంబీ వ్యాలీని  ఇటీవల అటాచ్‌ చేసింది.  రూ.14,799 కోట్ల రికవరీ నేపథ్యంలో దీన్ని ఎటాచ్‌  చేసింది. సంబంధిత నగదు చెల్లించని పక్షంలో వేలం వేస్తామని గతంలోనే  సుబ్రతోరాయ్కి వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్ ఆక్షన్లో పెట్టి చెల్లించాల్సిన డబ్బును రాబడతామని చెప్పింది.

సహారా ఇప్పటికే రూ.11వేల కోట్లను సెబీకి చెల్లించగా.. మిగతా బ్యాలెన్స్ రూ.14,779 కోట్లను  2019 జూలై వరకు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. అయితే 2019 వరకు పొడిగించడం కాలయాపనేనని, చెల్లించాల్సిన నగదును రికవరీ చేయడానికి ప్రాపర్టీస్ ఆస్తుల ఆక్షన్ చేపడతామని కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement