Sahara group Aamby Valley project
-
ఆంబే వాలీ అమ్మకానికి రంగం సిద్ధం
న్యూఢిల్లీ: సహారాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. సహారా అధిపతి సుబ్రతోరాయ్కి చెందిన విలువైన ఆస్తిని వేలం వేయాలని ఆదేశించి సుప్రీంకోర్టు ఆయకు గట్టి షాకిచ్చింది. డబ్బులు చెల్లించని పక్షంలో వేలం వేస్తామని గతంలో తీవ్రంగా హెచ్చరించిన సుప్రీం వేలానికి సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంబైలోని సహారా గ్రూప్‌కు చెందిన అత్యంత విలువైన ఆస్తి ఆంబే వాలీని వేలం వేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచరాణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. అలాగే సహారా అధిపతి సుబ్రతో వ్యక్తిగతంగా ఏప్రిల్ 28న కోర్టుముందు హాజరు కావాలని ఆదేశించింది. రూ. 300 కోట్లను చెల్లించడంలో సహారాసంస్థ విఫలమైన నేపథ్యంలో ఈ ఆస్తిని వేలం వేయాలని తీర్పు చెప్పింది. దీనికి సంబంధించి ముంబై హైకోర్టుప్రతినిధి అధికారికి లిక్విడేటర్ గా నియమించింది. గ్రూప్‌లోని రెండు కంపెనీలు ఇన్వెస్టర్లకు చెల్లించాల్సి ఉన్న రూ.39వేల కోట్లు విలువైన ఆంబీ వ్యాలీని ఇటీవల అటాచ్ చేసింది. రూ.14,799 కోట్ల రికవరీ నేపథ్యంలో దీన్ని ఎటాచ్ చేసింది. సంబంధిత నగదు చెల్లించని పక్షంలో వేలం వేస్తామని గతంలోనే సుబ్రతోరాయ్కి వార్నింగ్ ఇచ్చింది. పబ్లిక్ ఆక్షన్‌లో పెట్టి చెల్లించాల్సిన డబ్బును రాబడతామని చెప్పింది. సహారా ఇప్పటికే రూ.11వేల కోట్లను సెబీకి చెల్లించగా.. మిగతా బ్యాలెన్స్ రూ.14,779 కోట్లను 2019 జూలై వరకు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. అయితే 2019 వరకు పొడిగించడం కాలయాపనేనని, చెల్లించాల్సిన నగదును రికవరీ చేయడానికి ప్రాపర్టీస్ ఆస్తుల ఆక్షన్ చేపడతామని కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఖరీదైన సహారా ఆస్తిని అటాచ్ చేసిన సుప్రీం
న్యూఢిల్లీ : సహారా అధినేత సుబ్రతోరాయ్కి సుప్రీంకోర్టు షాకిచ్చింది. సహారా గ్రూప్‌కు చెందిన అత్యంత విలువైన ఆస్తి ఆంబే వాలీని అటాచ్ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. ఈ ప్రాపర్టీ విలువ రూ.39వేల కోట్లు. గ్రూప్‌లోని రెండు కంపెనీలు ఇన్వెస్టర్లకు చెల్లించాల్సి ఉన్న రూ.14,799 కోట్ల రికవరీ నేపథ్యంలో ఈ ప్రాపర్టీని అటాచ్ చేస్తున్నట్టు తెలిపింది. డబ్బులు చెల్లించకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సుప్రీంకోర్టు, సుబ్రతోరాయ్కి వార్నింగ్ ఇచ్చింది. జస్టిస్ దీపక్ మిశ్రా, రంజన్ గొగోయ్, ఏ.కే సిక్రి సభ్యులుగా ఉన్న స్పెషల్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అంబీ వాలీ సిటీని సహారా గ్రూప్ మహారాష్ట్రలోని పుణేలో డెవలప్ చేసింది. ఎలాంటి చిక్కులు లేని ఆస్తులనూ సహారా గ్రూప్ తమకు ఫిబ్రవరి 20 వరకు సమర్పించాలని ఆదేశించింది. ఈ ప్రాపర్టీస్‌ను పబ్లిక్ ఆక్షన్‌లో పెట్టి చెల్లించాల్సిన డబ్బును రాబడతామని చెప్పింది. సహారా ఇప్పటికే రూ.11వేల కోట్లను సెబీకి చెల్లించగా.. మిగతా బ్యాలెన్స్ రూ.14,779 కోట్లను 2019 జూలై వరకు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. అయితే 2019 వరకు పొడిగించడం కాలయాపనేనని, చెల్లించాల్సిన నగదును రికవరీ చేయడానికి ప్రాపర్టీస్ ఆస్తుల ఆక్షన్ చేపడతామని కోర్టు తెలిపింది. ఈ విషయంపై తదుపరి విచారణను ఫిబ్రవరి 20న చేపట్టనున్నట్టు పేర్కొంది. .