న్యూఢిల్లీ: మోసపూరిత పథకాల గురించి ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు, అవగాహ న కల్పించేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొత్తగా విస్తృత ఎస్‌ఎంఎస్ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం’ అనే ప్రకటనలు మోసపూరిత చర్యలో భాగమేనని సెబీ తెలిపింది. పెట్టుబడి పెట్టేముందు ఇన్వెస్టర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది. కొందరు మోసగాళ్లు ఇన్వెస్టర్ల మొబైల్ నెంబర్లను ట్యాప్ చేసి, వారికి వివిధ సందేశాలు పంపి, ఆకర్షిస్తున్నారని పేర్కొంది. సెబీ గతంలో నుంచే ఇన్వెస్టర్ల అవగాహన, అప్రమత్తత కోసం పత్రికా, టీవీ ప్రకటనలను ఇస్తోంది.