వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ ట్రెండ్‌కు తోడు స్థానిక జెవెల్లర్స్ కొనుగోళ్లను పెంచేయడంతో పదిగ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి.. రూ. 28,550కి చేరింది. ఇక వెండి కూడా రూ. 40వేల మార్క్‌ను దాటింది. కిలో వెండి ధర రూ. 650 పెరిగి.. రూ. 40,250కి చేరింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారులు భారీగా వెండి కొనుగోలు చేస్తుండటంతో రజతం ధర జోరు పెంచింది.
అంతర్జాతీయంగా కూడా బంగారం ధర పెరిగింది. సింగపూర్‌లో బంగారం ధర 0.38శాతం 1,162.70 అమెరికన్ డాలర్లకు చేరుకోగా, పదిగ్రాముల వెండి ధర 0.83శాతం పెరిగి 16.41 డాలర్లకు చేరింది.
ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం పది గ్రాముల ధర రూ. 200 పెరిగి, రూ. 28,550కి చేరుకోగా, 99.5శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 200 పెరిగి, 28,400కు చేరుకుంది.