ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.ఆరంభంనుంచీ లాభనష్టాల ఊగిసలాట మధ్య కొనసాగిన మార్కెట్లు జీడీపీ అంచనాలతో చివర్లో బలహీనపడ్డాయి. వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు క్షీణించి 28,743 వద్ద , నిఫ్టీ 17 పాయింట్లు తగ్గి 8,880 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా రియల్టీ ఎఫ్‌ఎంసీజీ ఐటీ నష్టపోగా, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ లాభపడ్డాయి. గ్రాసిమ్, బీపీసీఎల్, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, ఇన్‌ఫ్రాటెల్, హీరోమోటో, ఐటీసీ, టీసీఎస్ నష్టాల్లో ముగిశాయి. భెల్ 6 శాతం దూసుకెళ్లింది. భారతీ, ఏషియిన్ పెయింట్స్, యస్‌బ్యాంక్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఎంఅండ్‌ఎం ఇదే బాటలో పయనించాయి.
డాలర్ మారకంలో రూపాయి 0.01 నష్టంతో రూ. 66.72 వద్ద నిలిచింది. ఎంసీఎక్స్‌మార్కెట్ లో బంగారం బాగా బలహీనపడింది. పది గ్రా. రూ.160 క్షీణించి రూ.29,550 వద్ద ఉంది.