ముంబై: ఆరంభంలో లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా అమెరికా కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్ షాక్ ఐటీ సెక్టార్ ను భారీగా తాకింది. ట్రంప్ అనుసరించే విధానాల ఆందోళనల నేపథ్యంలో మదుపర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్‌ఈలో ఐటీ రంగం 2.8 శాతం క్షీణించింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ దాదాపు 3 శాతం నష్టపోతోంది. ఇతర సెక్టార్లతో పాటు ఐటీ, టెక్నాలజీ రంగ షేర్ల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 31పాయింట్లు పతనమై 26,847-వద్ద, నిఫ్టీ 10 పాయింట్లుక్షీణించి 8300 స్తాయి దిగువన 8,264వద్ద కొనసాగుతోంది
ముఖ్యంగా టెక్ మహీంద్రా, మైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్ టెక్, టాటా ఎలక్సీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, కేపీఐటీ, విప్రో లాంటి ఫ్రంట్ లైన్ ఐటీ షేర్లు 4-2 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ బాటలో ఇతర షేర్లు కూడా పయనిస్తున్నాయి. న్యూక్లియస్, సొనాటా సాఫ్ట్‌వేర్, రామ్‌కో సిస్టమ్స్, హెక్సావేర్, ఆప్టెక్, ఆర్‌ఎస్ సాప్ట్‌వేర్, నిట్ టెక్, జామెట్రిక్ తదితరాలు 4-2 శాతం మధ్య దిగజారాయి. దీంతో ఒకదశలో సెన్సెక్స్ 6శాతం, నిఫ్టీ 0.07 శాతం నష్టాలతో కొనసాగుతోంది. మరోవైపు రూపాయితో పోలిస్తే డాలర్ బలహీనత ఐటీని ప్రభావితం చేస్తోందని విశ్లేషకుల అంచనా.
మార్కెట్లకు ఐటీ షాక్!
Published Fri, Jan 6 2017 12:07 PM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM
Advertisement
Advertisement