వరుస దాడులతో ఇరాన్ అతలాకుతలం!
వరుస దాడులతో ఇరాన్ అతలాకుతలం!
Published Wed, Jun 7 2017 1:25 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
టెహ్రాన్: పశ్చిమాసియా దేశమైన ఇరాన్ వరుస ఉగ్ర దాడులతో ఉలిక్కిపడింది. ఉగ్ర సాయుధ మూక బుధవారం ఏకకాలంలో మూడుచోట్ల దాడులకు దిగింది. దేశ రాజధాని టెహ్రాన్‌లోని పార్లమెంటు భవనంలోనూ, కోమెనీ ప్రార్థనస్థలంలోనూ, మెట్రో స్టేషన్‌లోనూ ఉగ్రవాదులు సాయుధ ఉగ్రవాదులు దాడికి దిగినట్టు తెలుస్తోంది.
ఏకంగా పార్లమెంటు లోపల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. పార్లమెంటు లోపల ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు నక్కి ఉన్నారని, వారు ఏ క్షణమైన బీభత్సానికి ఒడిగట్టవచ్చునని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. పార్లమెంటు భవనంలో జరిగిన దాడిలో ముగ్గురు గాయపడినట్టు సమాచారం. పార్లమెంటులోపల సాయుధుల అదుపులో బందీగా పలువురు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక టెహ్రాన్‌లోని ప్రఖ్యాత విప్లవకారుడు రుహోల్లా ఖోమీనీ ప్రార్థనం స్థలం వద్ద భక్తులు లక్ష్యంగా ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇక్కడ జరిగిన ప్రాణనష్టం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఉగ్రవాదులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది.
Advertisement
Advertisement