సెల్ఫీ లవర్లకో సెన్సేషన్‌ న్యూస్‌! | smiling selfies makes you happy | Sakshi
Sakshi News home page

సెల్ఫీ లవర్లకో సెన్సేషన్‌ న్యూస్‌!

Published Tue, Oct 25 2016 9:28 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

హ్యాపీ సెల్ఫీ.. చిరుతో తమ్ముడు పవన్‌..

హ్యాపీ సెల్ఫీ.. చిరుతో తమ్ముడు పవన్‌..

ఈమధ్యకాలంలో సెల్ఫీల గురించి అన్నీ షాకింగ్‌ కథనాలే విన్నాం. సెల్ఫీలు అతిగా తీసుకొంటే అదొక మానసిక జబ్బుగా పరిణమించే అవకాశముందని హెచ్చరికలను చూశాం. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు దిగి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారిని చూసి అయ్యో అని బాధపడ్డాం.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సెల్ఫీ ప్రేమికులకు ఓ మంచి తీపి కబురు లాంటి వార్త ఇది. నవ్వుతూ సెల్ఫీలు దిగడం వల్ల మీరు ఆనందంగా ఉండే అవకాశాలు మరింత పెరుగుతాయట. సెల్ఫీల గురించి అన్నీ చెడ్డవార్తలే వస్తున్న తరుణంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ మంచి కబురు వెలువడింది. 41మంది విద్యార్థుల మీద నాలుగువారాలపాటు అధ్యయనం చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. సెల్ఫీలు తీసుకొని మీ మూడ్‌ ఎలా ఉందో తెలుపమంటూ పరిశోధకులు విద్యార్థులను కోరారు. అయితే, సెల్ఫీల కోసం లేని నవ్వు తెచ్చిపెట్టుకొని ఫొటో దిగినా.. ఆ రోజు మొత్తం చాలా ఆనందంగా, ఆత్మవిశ్వాసంగా గడిపినట్టు విద్యార్థులు ఈ అధ్యయనంలో వెల్లడించారు. ఇలా సెల్ఫీలు తీసుకోవడం ద్వారా ఆనందకరమైన ప్రక్రియలో భాగం కావొచ్చునంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మార్క్‌ మారినో. ఆయన తన తరగతి గదిలో సెల్ఫీ టేకింగ్‌ ప్రాజెక్టును నిర్వహించారు. మన ప్రతిబింబాన్ని, మనలోని సుగుణాలను తెలుసుకోవడానికి కాదు.. ఎదుటివారితో మనం ఎలా కమ్యూనికేట్‌ కావాలన్న విషయంలో సెల్ఫీలు సాయం చేస్తాయని ఆయన చెప్తున్నారు.

కానీ..
సెల్ఫీలు ఆనందాన్ని ఇస్తాయి కరెక్టే.. కానీ మరీ ఎక్కువగా సెల్ఫీలు తీసుకోవడం మాత్రం అంతమంచిది కాదని మరో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ యల్దా ఉల్స్‌ తెలిపారు. "మనం ఎదిగాక మన చుట్టూ ఉన్న ప్రజలు, పరిసరాల ఫొటోలు తీసుకోవాలనుకుంటాం. మనతో మనం ప్రతిబింబించుకోవడం కన్నా సమాజంతో మనం ప్రతిబింబించుకోవడం ముఖ్యం కదా' అని ఉల్స్‌ చెప్తారు. నిజమే ఆత్మసంతృప్తికి, స్వీయమోహానికి మధ్య ఒక సన్నని రేఖ ఉంటుంది. సెల్ఫీలు విషయంలోనూ అది వర్తిస్తుంది.

ఇటీవలికాలంలో కొన్ని హ్యాపీ సెల్ఫీలివి..!!

 

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement