సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను మంగళవారమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొణతాల రామకృష్ణ, డీఏ సోమయాజులు, శోభా నాగిరెడ్డి, గట్టు రామచంద్రరావు, బి.జనక్‌ప్రసాద్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కె.శివకుమార్, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, బి.జనార్దన్‌రెడ్డి, దేపభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొని.. మహానేతలు గాంధీ, నెహ్రూ, పటేల్, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య చేపట్టి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. తెలంగాణ విముక్తికోసం పోరాటం చేసిన నాయకులను ప్రజలు ఎన్నటికీ మరువబోరన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ప్రజా శ్రేయస్సుకోసం పరితపించారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పారిపోయిన కొందరు భూస్వామ్య ముఠా నాయకులు.. టీఆర్‌ఎస్‌లో చేరి తెలంగాణవాదం పేరుతో గ్రామాలపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గట్టు రామచంద్రరావు విమర్శించారు.
త్యాగాలను సమాజం మరువదు: బాజిరెడ్డి గోవర్దన్
Published Wed, Sep 18 2013 2:47 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement