ఒంగోలు క్రైం: రైళ్లలో దొంగతనాలు అరికట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని రైల్వే జీఆర్ పీ అడిషనల్ డీజీపీ కేఆర్‌ఎం కిషోర్ కుమార్ చెప్పారు. ఆదివారం ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. విజయవాడ నుంచి చెన్నై మార్గంలో తిరుపతి-గుంతకల్లు ప్రాంతాల్లో దొంగతనాలు అదుపులోకి వచ్చాయన్నారు. అయితే విజయవాడ-విశాఖపట్నం రైల్వే మార్గంలో దొంగతనాలు ఇంకా జరుగుతున్నాయని చెప్పారు.
సహచర ప్రయాణీకుల్లా నటిస్తూ టీలో మత్తు పదార్థాలు కలిపి దొంగతనాలకు పాల్పడుతున్న బ్యాచ్‌లను ఇటీవల గుర్తించామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20, 30 గ్యాంగ్‌లు రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ తిరుగుతున్నట్లు వివరించారు. ప్రత్యేక పోలీస్ బందాలతో వీరికి చెక్ పెట్టనున్నట్టు చెప్పారు.
ప్రత్యేక బృందాలతో రైళ్లలో దొంగతనాలకు చెక్’
Published Sun, Aug 16 2015 7:29 PM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement
Advertisement