గంటసేపు మంతనాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో మంగళవారం మంతనాలు జరిపిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై సుజనా చౌదరి బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో హైదరాబాద్ రాజ్‌భవ న్‌లో భేటీ అయ్యారు. వారిరువురూ సుమారు గంటసేపు చర్చలు జరిపారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రత్యేక కోర్టు ఆదేశాలతో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు ముమ్మరమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి అటు బీజేపీ నేతలను, ఇటు గవర్నర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ కేసులో చోటుచేసుకుంటున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నదని అధికారవర్గాలంటున్నాయి. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఏసీబీ డీజీ ఏకేఖాన్, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిలతో గవర్నర్ మంగళవారం సమావేశమైన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో కేంద్రమంత్రి భేటీపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకే సుజనా గవర్నర్‌తో భేటీ అయ్యారని తెలుగుదేశం వర్గాలు తెలిపాయి.
గవర్నర్‌తో సుజనా భేటీ
Published Thu, Sep 1 2016 1:05 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM
Advertisement