లైంగిక వేధింపుల కేసు.. జస్టిస్ గంగూలీపై ఆరోపణలు | supreme court panel names judge accused of sexual harassment | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపుల కేసు.. జస్టిస్ గంగూలీపై ఆరోపణలు

Published Fri, Nov 29 2013 6:31 PM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM

లైంగిక వేధింపుల కేసు.. జస్టిస్ గంగూలీపై ఆరోపణలు - Sakshi

లైంగిక వేధింపుల కేసు.. జస్టిస్ గంగూలీపై ఆరోపణలు

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఇరుక్కున్న న్యాయమూర్తి ఏకే గంగూలీ అని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టులోని ఓ సీనియర్ న్యాయమూర్తి (ప్రస్తుతం పదవీ విరమణ చేశారు) తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా న్యాయవాది గతంలో ఫిర్యాదు చేశారు. ఆ కేసును విచారించిన త్రిసభ్య కమిటీ.. ఇప్పుడు ఆ న్యాయమూర్తి పేరును బయట పెట్టింది.

కమిటీలో ఉన్న ముగ్గురు న్యాయమూర్తులు ఆరుసార్లు సమావేశమైన తర్వాత తమ నివేదికను గురువారం సమర్పించారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పేరు బయట పెట్టడం స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి!! సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివంకు నివేదిక సమర్పించారు. బాధిత న్యాయవాది వాంగ్మూలం, పదవీ విరమణ చేసిన జస్టిస్ ఏకే గంగూలీ వాంగ్మూలం కూడా ఈ నివేదికలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement