
నామినేషన్ల తిరస్కరణపై తీర్పు వాయిదా
అసంపూర్తి వివరాలతో దాఖలైన నామినేషన్లను తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుందా.. ఉండదా అన్న అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం తరఫు వాదనలను ఆలకించింది.
అసంపూర్తి నామినేషన్లను తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉండాల్సిందేనని ఈసీ తెలపగా.. ఈ ఒక్క కారణంతో ఎన్నికల్లో పోటీ చేసే రాజ్యాంగబద్ధ హక్కును నిరాకరించడం తగదని కేంద్రం వాదించింది. వాదనల అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.