Justice Sathasivam
-
అమిత్‌షా కేసులో అనుకూల తీర్పుకు ప్రతిఫలమా?
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంను కేరళ గవర్నర్‌గా నియమించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అమిత్‌షా కేసులో సదాశివం ఇచ్చిన తీర్పునకు ఇది ప్రతిఫలమా? అని ప్రశ్నించింది. ‘తమకు అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యానించారు. కాగా, సదాశివంను కేరళ గవర్నర్‌గా నియమించవద్దని రాష్ట్రపతిని అభ్యర్థిస్తూ కేరళ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. షీలా దీక్షిత్ రాజీనామా చేయడంతో కేరళ గవర్నర్ పదవి ఖాళీ అయింది. -
నిరాశేనా!
రాజీవ్ హంతకుల విడుదల ఇప్పట్లో లేనట్లే సుప్రీం నిర్ణయంతో నిరాశ మళ్లీ పోరాటం అంటున్న అర్బుతామ్మాళ్ చెన్నై, సాక్షి ప్రతినిధి: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు క్షమాభిక్షపై విడుదలవుతారని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారు శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో నిరాశకు లోనయ్యూరు. కన్నీరుమున్నీరైన పేరరివాళన్ తల్లి అర్బుతామ్మాళ్ మళ్లీ పోరాడుతానని ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ 1991 మే 21వ తేదీన చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ మానవబాంబు దాడిలో హత్యకు గురయ్యూరు. ఈ కేసుకు సంబంధించి 26 మందికి శిక్ష విధించారు. వారిలో మురుగన్, శాంతన్, పేరరివాళన్, నళినీలకు ఉరిశిక్ష పడింది. తమ శిక్షను రద్దుచేయాలని రాష్ట్రపతికి, కేంద్రానికి వారు విజ్ఞప్తి చేసుకున్నారు. పసి బిడ్డతల్లి అనే మానవీయ కోణంలో నళినీకి పడిన ఉరిశిక్షను యావజ్జీవంగా మార్చారు. మిగిలిన వారి విషయూన్ని కేంద్రం 11 ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టింది. దీనిపై వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు వారి శిక్షను కూడా యావజ్జీవంగా మారుస్తున్నట్టు 2014 ఫిబ్రవరి 18వ తేదీన తీర్పు ఇచ్చింది. వారికి క్షమాభిక్ష పెట్టే విచక్షణాధికారాన్ని కొన్ని షరతులతో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ క్రమం లో ఆ ముగ్గురితోపాటు మొత్తం ఏడుగురికి జైలు జీవితం నుంచి విముక్తి ప్రసాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా హర్షం వెలిబుచ్చాయి. తమిళనాడు ప్రజలు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేగాక సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు ఏడుగురి విడుదలపై స్టే ఇచ్చింది. దీంతో ఆ ఏడుగురి విడుదల ఆగిపోయింది. ఈ పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదుల వాదోపవాదాలు గత నెల 27వ తేదీతో పూర్తయ్యాయని, ఈ నెల 25వ తేదీలోగా తీర్పు వెలువడుతుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఈ నెల 18వ తేదీన కోవైలో ప్రకటించారు. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తించింది. ఈ క్రమంలో శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఖైదీల కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు నిరాశకు లోనైయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం శుక్రవారం పదవీ విరమణ చేస్తున్నందున మానవతా ధృక్పథంతో చివరి కేసుగా వారికి విముక్తి ప్రసాదిస్తారని అందరూ ఆశించారు. శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు భయంకర ఉగ్రవాదులు కాబట్టి వారికి క్షమాభిక్షపై రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకునేందుకు వీలులేదని జస్టిస్ సదాశివం వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఏడు అంశాలపై విచార ణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను మూడు నెలల్లోగా ఏర్పాటు చేయూలని ఆదేశించారు. -
అప్పీలుకెళ్లేలా ఉండకూడదు
న్యూఢిల్లీ: లోక్ అదాలత్‌లు ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి ఉద్దేశించిన ఉత్తమ వ్యవస్థ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సదాశివం అన్నారు. అయితే, అక్కడ ఇచ్చే తీర్పులు కక్షిదారులు అప్పీల్‌కు వెళ్లేలా ఉండకూడదని లోక్‌అదాలత్ సభ్యులకు సూచించారు. కేసులో తుది నిర్ణయానికి లేదా రాజీకి కక్షిదారులు బలవంతంగానో, మాయమాటల వల్లో కాకుండా స్వచ్ఛందంగా అంగీకారం తెలిపేటట్లుగా ఉండాలన్నారు. శనివారం సుప్రీంకోర్టులో ఏర్పాటుచేసిన జాతీయ లోక్ అదాలత్‌ను సీజేఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమార్కులు ఫోర్జరీలు, అడ్డదారులు తొక్కడానికి లోక్‌అదాలత్‌లు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. కక్షిదారులను భయపెట్టడానికి, తప్పుదారి పట్టించడానికి, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా పరిష్కరించాలని లోక్ అదాలత్ సభ్యులకు సూచించారు. సుప్రీంకోర్టు సహా దేశవ్యాప్తంగా హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో దాదాపు 39 లక్షల పెండింగ్ కేసులు విచారించినట్లు చెప్పారు. జిల్లా, తాలూకా కోర్టులను కంప్యూటరీకరిస్తామని సీజేఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవా సంస్థ (నల్సా-ఎన్ఏఎల్ఎస్ఏ) కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ జీఎస్ సింఘ్వి కూడా మాట్లాడారు. ఇరుపక్షాలూ విజేతలే లోక్‌అదాలత్ తీర్పులపై లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ రోహిణి వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల్లో తుది విచారణ తర్వాత వచ్చే తీర్పు ఒకరి పక్షమే ఉంటుందని, కానీ లోక్‌అదాలత్‌లో ఇరువర్గాలను ఒప్పించి పరిష్కారం చూపడం ద్వారా ఇరువురూ విజేతలుగా నిలిచి సంతోషంగా వెళ్తారని న్యాయసేవా సాధికార సంస్థ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను శనివారమిక్కడి నాంపల్లి క్రిమినల్ కోర్టుల ఆవరణలో ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్నచిన్న వివాదాల్లో పోలీస్స్టేషన్లకు వెళ్లకుండా లీగల్ సర్వీస్ అథారిటీలను సంప్రదిస్తే న్యాయమూర్తులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇరుపక్షాలకు కౌన్సెలింగ్ నిర్వహించి వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా వివాదాలను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం అందరికీ మంచిదని చెప్పారు. నిరుపేదలకు లీగల్ సర్వీస్ అథారిటీ ఉచితంగా న్యాయసహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. జైళ్లలో అదాలత్‌లు నిర్వహించి కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. బాలనేరస్తుల సంక్షేమం కోసం లీగల్ సర్వీస్ అథారిటీ అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ రోహిణి స్వయంగా మూడు కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్, న్యాయమూర్తులు బాలయోగి, లక్ష్మీపతి, ధర్మారావు, లక్ష్మణ్, రాధాకృష్ణకృపాసాగర్, ఎంవీ రమేష్, రాజ్‌కుమార్, సీఎంఎం రాధాదేవి, రాజేశ్వరి, శైలజ, శివనాగజ్యోతి, శ్రీదేవి, ఆంజనేయశర్మ, భాస్కర్, రజిని, అదనపు సీపీ సందీప్ శాండిల్య, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, వై.రాములు, తిరుపతివర్మ, వెంకటరమణారెడ్డి, అదాలత్ సభ్యులు వినోద్‌కుమార్, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల తిరస్కరణపై తీర్పు వాయిదా
అసంపూర్తి వివరాలతో దాఖలైన నామినేషన్లను తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుందా.. ఉండదా అన్న అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం తరఫు వాదనలను ఆలకించింది. అసంపూర్తి నామినేషన్లను తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉండాల్సిందేనని ఈసీ తెలపగా.. ఈ ఒక్క కారణంతో ఎన్నికల్లో పోటీ చేసే రాజ్యాంగబద్ధ హక్కును నిరాకరించడం తగదని కేంద్రం వాదించింది. వాదనల అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. -
‘ఖైదీల విడుదల’పై ఇతర రాష్ట్రాలకూ నోటీసులు
సెప్టెంబర్ 17న తుది విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: క్షమాభిక్షపై ఖైదీలను విడుదల చేయాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గతంలో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. తాజాగా దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలకూ నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లోగా వాటికి జవాబివ్వాలని ఆదేశిస్తూ.. ఈ వ్యవహారంపై సెప్టెంబర్ 17న తుది విచారణ చేపడతామని పేర్కొంది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి 150 ఏళ్లు పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని 2007లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,500 మంది ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేయాలని నిర్ణయించగా.. న్యాయవాది ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి దాన్ని సవాల్‌చేస్తూ పిటిషన్ వేయడంతో ఆ ప్రక్రియ నిలిచిన సంగతి తెలిసిందే. తుది విచారణ నిమిత్తం ఈ వ్యాజ్యం సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది. ఖైదీల విడుదలకు సంబంధించి మిగతా రాష్ట్రాలను కూడా ప్రతివాదులుగా చేర్చారా? అని జస్టిస్ సదాశివం పిటిషనర్ తరఫు న్యాయవాది గల్లా సతీష్‌ని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలను ప్రతివాదులుగా పేర్కొనలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రమే సవాల్ చేసినట్టు ఆయన బదులిచ్చారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ఖైదీలకు క్షమాభిక్ష వ్యవహారంపై విచారిస్తున్నందున మిగతా రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీచేయాలని, ఆయా రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. కాగా, తన క్లయింట్‌పై మావోయిస్టు ముద్ర వేశారని, పోలీసులు పర్సనల్ ఫైల్ తెరిచారని, దీనికి సంబంధించి తాము దాఖలు చేసిన వ్యాజ్యకాలీన దరఖాస్తును విచారించాలని సతీష్ విన్నవించారు. దీనికి సదాశివం స్పందిస్తూ.. తుది విచారణ సమయంలో దాన్నీ విచారిస్తామని చెప్పారు. తమిళనాడులో ఖైదీల విడుదలకు సంబంధించి సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను కూడా ప్రస్తుత పిటిషన్‌కు జత చేయాలని, రెండింటినీ కలిపి తుది విచారణ జరుపుతామని జస్టిస్ సదాశివం రిజిస్ట్రీని ఆదేశించారు.