
బ్యాంకాక్ పేలుళ్ల నిందితుడి ఊహాచిత్రం ఇదే
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బాంబు పేలుడు కేసు నిందితుడి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు.
బ్యాంకాక్: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బాంబు పేలుడు కేసు నిందితుడి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. బాంబు పేలుడు సంభవించిన సమయంలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ ఊహా చిత్రాన్ని రూపొందించారు.
సీసీటీవీ ఫుటేజిలోఒక ఫొటోలో వెనక బ్యాగు తగిలించుకుని, మరో ఫొటోలో మాత్రం బ్యాగు లేకుండా వెళ్లిన ఓ యువకుడే ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. కళ్లజోడు, పసుపు రంగు టీ షర్ట్ ధరించిన ఈ వ్యక్తి బ్రహ్మదేవుడి ఆలయం నుంచి పక్కనే ఉన్న హోటల్ వైపు వెళ్లినట్టు గుర్తించారు. సోమవారం రాత్రి బ్యాంకాక్ నగరం నడిబొడ్డున బ్రహ్మదేవుడి ఆలయం ప్రాంగణంలో సంభవించిన పేలుడులో 22 మంది మరణించగా, మరో 23 మంది గాయపడ్డారు.