బ్లాక్‌డీల్‌ తో ఐటీసీ జోరు | SUUTI Sells 2% Stake Worth Almost Rs 6,700 Cr In ITC | Sakshi
Sakshi News home page

బ్లాక్‌డీల్‌ తో ఐటీసీ జోరు

Published Tue, Feb 7 2017 9:57 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

బ్లాక్‌డీల్‌ తో  ఐటీసీ జోరు

బ్లాక్‌డీల్‌ తో ఐటీసీ జోరు

ముంబై: స్టాక్ మార్కెట్ ద్వారా ఖజానా నింపుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్న కేంద్ర ప్రభుత్వం  తాజాగా ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం  ఐటీసీలో భారీ వాటాను  విక్రయించింది.  ద స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూటీఐ(ఎస్‌యూయూటీఐ) ద్వారా ఈ భారీ వాటాను విక్రయించింది. సుమారు రూ. 6,700 కోట్ల విలువైన  వాటాను ఎస్‌యూయూటీఐ విక్రయించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బ్లాక్‌డీల్స్‌ ద్వారా 2 శాతం వాటా(24.2 కోట్ల షేర్లు)  విక్రయించింది. దీంతో   మార్కెట్లో ఐటీసీ కౌంటర్‌  జోరందుకుంది.


బడ్జెట్‌ లో సిగార్‌ ఉత్పత్తులపై  కస్టమ్స్‌ సుంకం విధించడంతో ఇటీవల భారీగా  లాభపడిన ఐటీసీ ఇవాల్టి మార్కెట్లోమరింత  పుంజుకుంది.  ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 290 వద్ద ట్రేడవుతోంది. షేరుకి రూ. 279.50 సగటు ధరలో ఎన్‌ఎస్‌ఈ ద్వారా ఈ డీల్‌ జరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి.

మరోవైపు ఐటీసీ ఛైర‍్మన్‌ దేవేశ్వర్‌  కంపెనీనుంచి వైదొలగారు.  సంజీవ్‌పురిని  కొత్త  సీఈవోగా  నియమించింది. సోమవారంనుంచి ఈ కొత్త నియామకం అమల్లోకి  వచ్చింది.

కాగా గత ఏడాది  రిలయన్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్), ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో పాటు పలు టాటా గ్రూప్ కంపెనీల వాటాలనుంచి  రానున్న మూడేళ్లలో పూర్తిగా వైదొలగాలన్నది సర్కారు ప్రణాళికను వెల్లడించింది. ఎస్‌యూయూటీఐ ద్వారా దేశంలోని దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు సహా మొత్తం 51 లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో తనకున్న మైనారిటీ వాటాల అమ్మకం ప్రక్రియకు దిగిన సంగతి తెలిసిందే. 
 

Advertisement
Advertisement