అనారోగ్యంతో పొడగరి గట్టయ్య మృతి | tallest person gattaiah passed away | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో పొడగరి గట్టయ్య మృతి

Published Sat, Oct 31 2015 8:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM

అనారోగ్యంతో పొడగరి గట్టయ్య మృతి

అనారోగ్యంతో పొడగరి గట్టయ్య మృతి

హైదరాబాద్:  ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా నిలిచిన  పొలిపాక గట్టయ్య అనారోగ్యంతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పుట్నూరుకు చెందిన గట్టయ్య గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నారు. శిల్పారామం సందర్శకులకు గట్టయ్య ను ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలువురు సెలబ్రిటీలతో పాటు పిల్లలు, పెద్దలు కూడా గట్టయ్యతో కలిసి ఫొటో దిగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సినీనటులు మంచు విష్ణు లాంటి వాళ్లు కూడా గట్టయ్యతో కలిసి ఫొటోలు తీయించుకున్నారు.

ఏడున్నర అడుగుల ఎత్తు ఉండే కొలిపాక గట్టయ్యతో ఫొటో దిగేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతుంటారు. ఈయనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శిల్పారామంలో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ఆయన కొన్ని రోజులుగా ఆస్తమాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వెళ్లి, తిరిగి హైదరాబాద్ వచ్చారు. గట్టయ్యకు తల్లి లక్ష్మి, అన్న చంద్రయ్య ఉన్నారు. ఒకరకమైన వ్యాధి కారణంగానే పొడవు అసాధారణంగా పెరిగినట్లు చెబుతున్నారు.

శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గట్టయ్య మృతదేహాన్ని స్వగ్రామం పుట్నూరుకు తరలించారు. శనివారమే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement