వరంగల్: వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. తెలుగు తమ్ముళ్లు బాహాబాహీ తలపడ్డారు. పార్టీ సమావేశంలో తెలుగు తమ్ముళ్లు కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఆదివారం వరంగల్ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ గుండు సుధారాణి వర్గీయులు ఘర్షణకు దిగారు. మాటమాటి పెరిగి తన్నుకున్నారు. దీంతో పార్టీ సమావేశంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
తెలుగు తమ్ముళ్ల డిష్యుం డిష్యుం
Published Sun, Aug 2 2015 4:43 PM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM
Advertisement
Advertisement