క్లాస్మేట్పై ఆమె పుట్టినరోజునాడే అత్యాచారం | Teen raped by classmate in Thane | Sakshi
Sakshi News home page

క్లాస్మేట్పై ఆమె పుట్టినరోజునాడే అత్యాచారం

Published Mon, Feb 24 2014 12:26 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

Teen raped by classmate in Thane

తోటి విద్యార్థినిపై ఆమె పుట్టినరోజు నాడే అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఈ దారుణం మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగింది. కళ్యాణ్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్లో పదమూడేళ్ల అమ్మాయి చదువుతోంది. అక్కడే సంతోష్ పవార్ (23) కూడా చదువుతున్నాడు. వీళ్లిద్దరూ ఒకే ప్రాంతం నుంచి కోచింగ్ సెంటర్కు వస్తుండటంతో స్నేహితులుగా కూడా ఉండేవారు. అయితే, ఫిబ్రవరి 14.. అంటే వాలెంటైన్స్ డే రోజునే ఆమె పుట్టిన రోజు.

ఆ రోజు అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు.అయితే ఆ తర్వాత అదే కోచింగ్ సెంటర్ మేడ మీదకు తీసుకెళ్లి ఆమెపై సంతోష్ పవార్ అత్యాచారం చేసినట్లు పోలీసు అధికారి వీకే హీరే తెలిపారు. ఆమె చేసిన ఫిర్యాదు మేరకు సంతోష్ పవార్పై ఐపీసీ సెక్షన్ 376, పిల్లలకు లైంగిక దాడుల నుంచి రక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement