
నరేంద్ర మోడీ
హైదరాబాద్: బీజేపీ ప్రచార కమిటీ సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మాయాజాలం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. హైదరబాద్‌లో నిర్వహిస్తున్న నవభారత యువభేరీలో పాల్గొనేందుకు రాజధానికి వచ్చిన మోడీని కలిసేందుకు వివిధ రంగాల ప్రముఖులు భారీగా తరలివచ్చారు.పార్క్ హయత్ హొటల్లో ఆయన బిజీబిజీగా ఉన్నారు.
తెలుగు సినీపరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, రాఘవేంద్ర రావు, కీరవాణి, మురళీమోహన్, జగపతిబాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న, గౌతమి తదితరులు మోడీని కలిశారు. వీరితో పాటు కార్పొరేట్ హాస్పటల్స్ యజమానులు, సాధువులు, మహంతులు నరేంద్రమోడీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణమాదిగ కూడా మోడీని కలిశారు.