పుణె - సతారా రహదారిపై సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న బస్సును వెనకు నుంచి కంటెయినర్ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాల్వలో పడింది. ఆ దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు.
అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.