జైల్లో కొట్టుకున్న ఖైదీలు, పోలీసు అధికారులు!
Published Sun, Aug 10 2014 9:33 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM
పాట్నా: జైల్లో ఖైదీలు, పోలీసులు అధికారులు కొట్టుకున్న సంఘటన బీహార్ లో టెన్సన్ క్రియేట్ చేసింది. ఈ ఘటన సీతామార్చి జిల్లాలో జైల్లో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ఖైదీలు, ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణకు బీహార్ జైళ్ల విభాగం ఐజీ ప్రేమ్ సింగ్ మీనా ఆదేశించారు.
అంతేకాకుండా బాధ్యతాయుతరాహిత్యంగా ప్రవర్తించిన జైలు సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ ను బదిలీ చేశారు. మాజీ మావోయిస్టు సంతోష్ ఝా, సమ్రాట్ చౌదరీ లను జైలు నుంచి తరలించాలని ఖైదీలు ఆందోళన చేపట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఖైదీలు రాళ్లు, పగిలిన అద్దాలు, ఇటుకలతో దాడి చేశారని జిల్లా మేజిస్టేట్ ప్రతిమా ఎస్. వర్మ తెలిపారు.
Advertisement
Advertisement