జీసస్ సమాధిపై ఆశ్చర్యకరమైన నిజాలు | The astonishing claims over the final resting place of Jesus: Why Japan, India and Glastonbury have all been put forward as places where he's buried | Sakshi
Sakshi News home page

జీసస్ సమాధిపై ఆశ్చర్యకరమైన నిజాలు

Published Sun, Nov 13 2016 1:21 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

జీసస్ సమాధిపై ఆశ్చర్యకరమైన నిజాలు

జీసస్ సమాధిపై ఆశ్చర్యకరమైన నిజాలు

మానవ చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవతామూర్తిగా యేసుక్రీస్తు పేరు గడించారనే విషయం మాత్రమే మనందరికీ తెలుసు. జెరుసలేం హోలీ సెపల్చేర్ లోని యేసుక్రీస్తు సమాధిని గత వారం తొలిసారి తెరిచారు. కానీ యేసు క్రీస్తు విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశం అదొక్కటే కాదు. 30 ఏడీలో మరణించిన మెసయ్య సమాధులు భారత్, జపాన్ లలో కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. 

క్రైస్తవ సంప్రదాయం ఏం చెబుతోందంటే

యేసుక్రీస్తుకు శిలువ వేసిన అనంతరం ఆయన దేహాన్ని సమాధి చేసేందుకు ప్రత్యేకమైన బండరాళ్లతో చిన్న నిర్మాణాన్ని తయారు చేశారు. దీన్ని ఎడిక్యూల్ అని పిలుస్తారు. ఎడిక్యూల్ అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. దీనికి చిన్ని ఇల్లు అని అర్ధం. ఆ నిర్మాణాన్ని దీపాలు, కొవ్వొత్తులతో అలంకరించి క్రీస్తు దేహానికి అభిషేకం చేసి గుడ్డతో చుట్టి సమాధి చేశారు. ఆ తర్వాత క్రీస్తు పునర్జర్మ ఎత్తినట్లు క్రైస్తవ సంప్రదాయం చెబుతోంది. కాగా, క్రీస్తును ఉంచిన సమాధి ఆయనకు శిలువ వేసిన ప్రదేశం నుంచి కొద్ది దూరంలోనే ఉంది. దీనిపై ప్రస్తుతం అథెన్స్ జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు.

హోలీ సెపల్చేర్ చర్చ్

జెరుసలేంలోని హోలీ సెపల్చేర్ చర్చిలో అసలైన జీసస్ సమాధి ఉందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంద్రి క్రైస్తవుల దృష్టిని కూడా ఈ చర్చి ఆకర్షిస్తోంది. అయితే చరిత్రకారులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. 

టాల్పాయిట్

జెరుసలేంలోని టాల్పాయిట్ పట్టణంలో 1922లో నిర్మితమైంది. 2007లో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ నిర్మించిన 'ది లాస్ట్ టూంబ్ ఆఫ్ జీసస్'లో టాల్పాయిట్ లో జీసస్ సమాధి ఉందని పేర్కొన్నారు. 1980లో టాల్పాయిట్ లో జరిగిన తవ్వకాల్లో పూర్వికులకు సంబంధించిన ఎముకలు, దేహాలను భద్రపరిచే అత్యంత పురాతన పేటికలు లభ్యమవడమే ఇందుకు కారణం. వీటిపై పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్టులు, బిబ్లికల్ స్కాలర్లు ఒకరినొకరు ఏకీభవించుకోలేదు. 

గ్లాట్సన్ బ్యూరీ

జెరుసలేంలోని బెత్లెహోమ్ యేసు జన్మస్ధలమని క్రీస్తు బోధనల్లో ఉంది. అయితే, యుక్త వయసులో జీసస్ బ్రిటన్ కు వెళ్లినట్లు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. బ్రిటన్ కు వలస వచ్చిన జీసస్ ప్రిడ్డీ, సోమర్ సెట్ ప్రాంతాల్లో స్ధిరపడ్డారని దీని సారాంశం. క్రీస్తు దేహాన్ని గ్లాట్సన్ బ్యూరీలో భద్రపరిచినట్లు ఈ కథ చెబుతుంది. 

భారత్, నేపాల్, జపాన్ లలో..

జీసస్ కు శిలువ వేయలేదని, ఆయన భారత్ కు వలస వచ్చి జీవనం కొనసాగించినట్లు 1800వ సంవత్సరంలో స్ధాపించిన అహ్మదీ ముస్లిం ఫెయిత్ అనే సంస్ధ చెబుతోంది. ఉత్తర కశ్మీర్ లోని రోజాబాల్ అనే పుణ్య ప్రదేశంలో క్రీస్తు దేహాన్ని సమాధి చేసినట్లు పేర్కొంది. నేటికి కూడా పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని చెప్పింది. అయితే, దీనిపై వివాదాలు ఉన్నాయి. ముస్లిం మత బోధకులు యోజా ఆసిఫ్, సయ్యద్ నజీరుద్దీన్ లకు చెందిన సమాధులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు స్ధానికులు చెబుతున్నారు.  

పదమూడేళ్ల ప్రాయంలో జీసస్ జెరుసలేంను విడిచి హిమాలయాలకు వచ్చినట్లు 1887లో రష్యా యుద్ధ ప్రతినిధి నికోలస్ నోటోవిట్చ్ పేర్కొన్నారు. తనకు లభ్యమైన ఓ డాక్యుమెంటులో ఇందుకు సంబంధించిన సమాచారం ఉందన్నారు. జీసస్ టిబెటన్ ఆచారాలను పాటిస్తూ బుద్ధిజాన్ని చదువుకున్నట్లు తెలిపారు. అయితే, చరిత్రకారులు ఈ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.

1930లో క్రీస్తుపై మరో కథ కూడా వెలుగు చూసింది. శిలువ నుంచి తప్పించుకుని తన సోదరుడు ఇసుకురిని తీసుకుని జీసస్ జపాన్ కు వచ్చినట్లు దీని కథనం. ఆ తర్వాత తన జీవితకాలన్ని మొత్తం షింజో అనే గ్రామంలో జీసస్ వెళ్లదీశారని పేర్కొంది. దీన్ని బలపరుస్తూ షింజో గ్రామంలోని సజిరో సవాగుచి కుటుంబం తాము జీసస్ వారసులమని ప్రకటించింది. 100 ఏళ్ల వయసు వరకూ జీసస్ జీవించారని చెప్పంది. ఆయన దేహాన్ని గ్రామానికి దగ్గరలో సమాధి చేసినట్లు పేర్కొంది. ఈ ప్రాంతాన్ని కూడా ఏళ్లుగా క్రైస్తవులు సందర్శిస్తూ వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement