యాంగూన్: పశ్చిమ మయన్నార్‌లో పెళ్లి బృందంతో వెళ్తున్న పడవ ఓ భారీ ఓడను ఢీకొనడంతో పడవలోని 20 మంది జలసమాధి అయ్యారు. వీరిలో 16 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో 30 మందిని రక్షించామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.
వివాహ వేడుకను ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. పడవలో సుమారు 60 మంది ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన బంధువులు.
ప్రమాదంలో పెళ్లిబృందం జలసమాధి
Published Sun, Apr 9 2017 7:50 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM
Advertisement
Advertisement