పుష్కరాలకెళ్లి వచ్చేసరికి.. ఇల్లు గుల్ల | Theives steals gold metals in home | Sakshi
Sakshi News home page

పుష్కరాలకెళ్లి వచ్చేసరికి.. ఇల్లు గుల్ల

Published Mon, Jul 20 2015 9:42 PM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

పుష్కరాలకెళ్లి వచ్చేసరికి.. ఇల్లు గుల్ల

పుష్కరాలకెళ్లి వచ్చేసరికి.. ఇల్లు గుల్ల

హైదరాబాద్ సిటీ: కరీంనగర్ జిల్లా ధర్మపురి గోదావరి పుష్కరాలకెళ్లి వచ్చేసరికి దొంగలు తమ ప్రదర్శన చూయించారు. నాచారం పరిధిలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన కృష్ణా గౌడ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారు. కృష్ణా గౌడ్ తన కుటుంబసభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో ఉలిక్కిపడ్డారు.

ఇల్లు తెరిస్తే చూస్తే ఇంటిలో విలువైన ఆభరణాలు తస్కరించినట్లు అర్ధమయింది. ఇల్లంతా చిందరవందర చేయడంతో పాటు 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు దోచుకెళ్లినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement