
మూడో దశలో 58 శాతం పోలింగ్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో మంగళవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో 58 శాతం పోలింగ్ నమోదైంది. జార్ఖండ్ లో 61 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపింది.
జమ్మూకశ్మీర్‌లోని 18 స్థానాలకు డిసెంబర్ 2న జరిగిన రెండో విడత ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్‌లోని 20 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 65.46 శాతం పోలింగ్ నమోదైంది.
జమ్మూకశ్మీర్‌లో నవంబర్ 25న 15 సీట్లకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71.28 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్‌లో 13 సీట్లకు అదే రోజు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 61.92 శాతం పోలింగ్ నమోదవడం తెలిసిందే.