కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల బైపాస్ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా... హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న టిప్పర్ ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.