కాశ్మీర్లో ఎన్కౌంటర్: ముగ్గురు తీవ్రవాదుల హతం | Three militants killed in Kashmir firing | Sakshi
Sakshi News home page

కాశ్మీర్లో ఎన్కౌంటర్: ముగ్గురు తీవ్రవాదుల హతం

Published Tue, Dec 3 2013 12:04 PM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

Three militants killed in Kashmir firing

కాశ్మీర్లోని కుప్వారా జిల్లా రాజ్వార్ గ్రామంలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారని ఐజీపీ అబ్దుల్ ఘానీ మీర్ బుధవారం వెల్లడించారు. ఆ గ్రామంలోని ఓ ఇంట్లో తీవ్రవాదులు ఆశ్రయం పొందారని సమాచారం అందిందని ఆయన తెలిపారు. దాంతో భద్రత సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని, ఓ ఇంటిని చుట్టుముట్టారని ఆయన వివరించారు.

 

ఆ విషయం గమనించిన తీవ్రవాదులు భద్రత దళాలపై కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. దాంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది కాల్పులకు ఉపక్రమించారన్నారు. ఇరు వర్గాల మధ్య సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement