సార్క్‌కు పోటీగా మరో కూటమి ఏర్పాటుకు సన్నాహాలు
ఇస్లామాబాద్: సార్క్ దేశాల్లో భారత్ ప్రాభవాన్ని సహించలేకపోతున్న పాక్.. దీనికి పోటీగా గ్రేటర్ సౌత్ ఏసియన్ ఎకనామిక్ అలయన్స్(విశాల దక్షిణాసియా ఆర్థిక కూటమి)ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో చైనా, ఇరాన్‌లతో పాటు మరికొన్ని మధ్య ఆసియా దేశాలను భాగస్వాములను చేయాలనుకుంటోంది. భారత్ కూడా ఈ కూటమిలో చేరవచ్చని పాక్ చెబుతున్నప్పటికీ దీని అసలు ఉద్దేశం మాత్రం భారత్‌ను దెబ్బకొట్టడమే.
ప్రస్తుతం న్యూయార్క్‌లో పర్యటిస్తోన్న పాకిస్తాన్ పార్యమెంటరీ బృందం కొత్త కూటమిపై చర్చిస్తున్నట్లు పాకిస్తాక్‌కు చెందిన డాన్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఆ బృందంలో సభ్యుడైన ముషాహిద్ హుస్సేన్ అమెరికాలో మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాసియా ఆర్థిక కూటమి ఏర్పాటు యత్నాలు నిజమేనని ధ్రువీకరించారు. ఈ కూటమి ఇప్పటికే మనుగడలో ఉన్నప్పటికీ ఆయా దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య పరమైన సహకారం లేదని ఆయన చెప్పారు. ఈ కూటమిలోకి భారత్‌ను కూడా ఆహ్వానిస్తున్నామని.. కానీ సార్క్ వల్ల లబ్ధి పొందుతున్నందున వాళ్లు చేరకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
పాక్ కొత్త ఎత్తుగడ
Published Thu, Oct 13 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
Advertisement